
బషీర్‌బాగ్, వెలుగు: ప్రముఖ జానపద రచయిత డాక్టర్ కె. ముత్యం రచించిన నేను చిందుల ఎల్లమ్మ పుస్తకాన్ని ఆయన కుమార్తె కె. ప్రత్యూష యామిని ఇంగ్లీష్‌లోకి అనువదించారు. ఈ పుస్తక ఆవిష్కరణ సభను ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించగా, ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కోదండరాం, మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సూర్యకుమారి ధనుంజయ, ఓయూ ఆర్ట్స్ కాలేజీ మాజీ అధ్యక్షులు తులా రాజేందర్, కేయూ పూర్వ వీసీ ప్రొఫెసర్ సాయన్న, మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యూష యామిని మాట్లాడుతూ.. ఈ రచన అనువాదం కంటే ఒక నివాళి అని చెప్పారు. ‘మా నాన్న ఎల్లప్పుడూ ఆయన రచనలను తెలుగు పాఠకులకు మించి చేరేలా అనువదించమని నన్ను కోరారు. ఆయన మరణించిన తర్వాత, ఆయన రచనలను ఇంగ్లీష్‌లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నా”అని తెలిపారు.