కంటోన్మెంట్ బై ఎలక్షన్స్​లో పోటీ చేస్త దివంగత ఎమ్మెల్యే : నివేదిత

కంటోన్మెంట్ బై ఎలక్షన్స్​లో పోటీ చేస్త దివంగత ఎమ్మెల్యే  :  నివేదిత

కంటోన్మెంట్, వెలుగు: బీఆర్ఎస్​ పార్టీ నేత లు, కార్యకర్తల అభీష్టం మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో పోటీ చేయనున్నట్లు దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత తెలిపారు. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడానికి ఇతర పార్టీలు సహకరించాలని కోరారు. ఈ మేరకు సికింద్రాబాద్ కంటో న్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల సమావేశం శనివారం జరిగింది. ముందుగా దివంగత ఎమ్మె ల్యే లాస్య నందిత మృతికి సంతాపం తెలియ జేస్తూ పార్టీ శ్రేణులు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.  కేడర్ అభీష్టానుసారం కంటోన్మెంట్ ఉపఎన్నికల బరిలో ఉంటానని నివేదిత వెల్లడించారు.  త్వరలోనే పార్టీ హైకమాండ్ ను కలుస్తామని చెప్పారు. ఒకవేళ ఎన్నికలు అనివార్యమైతే బరిలో నిల్చుని, ప్రజలందరి ఆశీర్వాదాన్ని కోరుతానని తెలిపారు.