ఔను.. వీళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. అన్యాయంగా బిడ్డను పొట్టనపెట్టుకున్నారు !

ఔను.. వీళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. అన్యాయంగా బిడ్డను పొట్టనపెట్టుకున్నారు !

తమిళనాడులో ఐదు నెలల పసికందును హత్య చేసిన కేసులో ఒక మహిళ, ఆమెతో లెస్బియన్ సంబంధం నడుపుతున్న మరో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని కెలమంగళం సమీపంలోని చిన్నటి ప్రాంతానికి చెందిన ఎస్. భారతికి (26) ఇద్దరు ఆడ పిల్లలు. ఐదు నెలల క్రితం ఒక మగబిడ్డకు కూడా జన్మనిచ్చింది. నవంబర్ 4న.. ఆమె బిడ్డకు పాలిచ్చింది. అయితే.. బిడ్డకు పొరపోయి ఊపిరాడక చనిపోయిందని భారతి కన్నీరుమున్నీరయింది. నిజమని నమ్మిన ఆమె భర్త బిడ్డ మృతదేహాన్ని వారి వ్యవసాయ భూమిలో పూడ్చి పెట్టారు.

అయితే.. బిడ్డ పోయాక ఏమాత్రం దిగులూచింతా లేకుండా తన భార్య ప్రవర్తన కనిపించేసరికి భారతి భర్తకు అనుమానమొచ్చింది. తన పిల్లాడిది సహజ మరణంలా అనిపించడం లేదని.. విచారణ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పొరపోయి చనిపోయాడని చెప్పడంతో బిడ్డ మృతదేహానికి ఎలాంటి పోస్టుమార్టం చేయకుండానే భారతి భర్త మృతదేహాన్ని పూడ్చి పెట్టడంతో హత్య అని తెలియలేదు. ఎప్పుడైతే పోలీసులు బిడ్డ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు.. పూడ్చిన బిడ్డ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేశారో అప్పుడు అసలు నిజం బయటపడింది. చిన్నారిని ఉక్కిరిబిక్కిరి చేసి, గొంతు కోసి చంపారని పోస్టుమార్టంలో వెల్లడైంది.

చిన్నారి చనిపోయాక కూడా భార్య సంతోషంగా ఉండటంతో ఆమె భర్త సురేష్ ఆమె వ్యవహార శైలిపై అనుమానం వ్యక్తం చేశాడు. ఆమె మొబైల్ ఫోన్‌ను చెక్ చేసినప్పుడు.. భారతి వారి పొరుగున ఉన్న సుమిత్ర (20) తో కలిసి ఉన్న ఫోటోలు.. వీడియోలు అతనికి దొరికాయి. ఆ ఇద్దరు మహిళలు లెస్బియన్ సంబంధంలో ఉన్నట్లు కొన్ని ఫొటోలు చూశాక అతనికి అర్థమైపోయింది. చిన్నారి చనిపోయాక సుమిత్రకు పిల్లాడు చనిపోయిన ఫోటోను పంపినట్లు భారతి భర్త సురేష్ కనిపెట్టాడు. సురేష్ కెలమంగళం పోలీసులకు ఫిర్యాదు చేయడం.. పోలీసులు పోస్ట్ మార్టం నిర్వహించడంతో ఈ లెస్బియన్ జంట చేసిన తప్పుకు కటకటాల్లో ఊచలు లెక్కిస్తున్నారు. వీరి అక్రమ బంధానికి ఐదు నెలల పిల్లాడు అన్యాయంగా బలైపోవడంతో స్థానికులు ఈ ఇద్దరికీ శాపనార్థాలు పెట్టారు.