స్కూల్కు లేట్గా వచ్చిందని 100 సిట్-అప్స్ కొట్టించిన టీచర్.. 6వ తరగతి విద్యార్థి మృతి

స్కూల్కు లేట్గా వచ్చిందని 100 సిట్-అప్స్ కొట్టించిన టీచర్.. 6వ తరగతి విద్యార్థి మృతి

పనిష్మెంట్ అంటే పిల్లలను సక్రమమైన మార్గానికి తీసుకొచ్చేందుకు చిన్నపాటి మందలింపు చర్యగా ఉండాలి కానీ.. ప్రాణాలు తీసేంతల ఉండకూడదు. సున్నితంగా ఉండే చిన్నారుల మనసును గాయపర్చకుండా.. వారిలో కాన్ఫిడెన్స్ దెబ్బతీయకుండా వారికి విద్యా బుద్ధులు నేర్పించాలి. కానీ కొందరు కర్కష టీచర్లు ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెస్తున్నారు. మహారాష్ట్రలో ఒక టీచర్ చేసిన పనికి  6వ తరగతి స్టూడెంట్ ప్రాణాలు పోయాయి. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. 

వివారాల్లోకి వెళ్తే.. పాల్ఘార్ జిల్లాలో 6వ తరగతి స్టూడెంట్ చనిపోయింది. స్కూల్ కు ఆలస్యంగా వచ్చిందని వంద సిటప్స్ (కూర్చొని లేవడం) తీయించారు వాళ్ల టీచర్. దీంతో వారం రోజుల తర్వాత ఆ చిన్నారి చనిపోవడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 

బ్యాగ్ వీపున ఉంచే సిటప్స్:

సాతివలి లోని వసాయి స్కూల్ కు చెందని చిన్నారి శుక్రవారం (నవంబర్ 14) రాత్రి చనిపోయింది. స్కూల్ లేట్ గా వచ్చారని ఐదు మంది విద్యార్థులను సిటప్స్ చేయించారు. బ్యాగ్ ను వీపును వేసుకుని చేయించారు. అసలే ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్ బ్యాగ్స్ బరువు ఎక్కువగా ఉంటాయి.  స్టూడెంట్ వెయిట్ కు సమానాంగా ఉండే బ్యాగ్ వేసుకుని సిటప్స్ చేయడంతో మెడ, వెన్నెముకపై భారం పడి అనారోగ్యానికి గురయ్యారు విద్యార్థులు. 

చనిపోయిన స్టూడెంట్ తల్లి మాట్లాడుతూ.. ఇది చాలా దారుణం.. పనిష్ మెంట్ కారణంగా నా కూతురు చనిపోయింది. బ్యాగ్ వేసుకుని సిటప్స్ చేయాల్సిందిగా టీచర్ చెప్పడంతో మెడ, బ్యాక్ పెయిన్ తో చిన్నారి లేచి నడవటానికి కూడా ఇబ్బంది పడింది. వారం రోజులు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చివరికి చనిపోయింది. ఆ టీచర్స్ పైన కచ్చితంగా చర్యలు తీసుకోవాలి.. నా కూతురును నాకు ఎవరు తెచ్చిస్తారు.. అంటూ బోరున విలపించింది చిన్నారి తల్లి. 

వసాయి కి చెందిన నఎంఎన్ఎస్ నేత సచిన్ మోరె మాట్లాడుతూ.. పాపకు అప్పటికే హెల్త్ ఇష్యూలు ఉన్నాయని టీచర్ కు తెలిసి కూడా.. పనిష్ మెంట్ ఇచ్చారు. వంద అని చెబుతున్నారు కానీ.. ఎన్ని సిటప్స్ చేయించారో క్లారిటీ లేదు.. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఈ ఘటనపై విచారణ జరిపిస్తున్నామని విద్యాశాఖ అధికారి తెలిపారు. అయితే పిల్లల నుంచి సరైన రిజల్ట్స్ వస్తలేవని పేరెంట్స్ తమపై ఒత్తిడి తెస్తున్నందు వలన పనిష్ మెంట్ ఇవ్వాల్సి వస్తుందని టీచర్లు అంటున్నారని.. కానీ బ్యాగ్ వీపున వేయించి సిటప్స్ వేయించి పిల్లను చంపేస్తారా.. చచ్చేదాకి పనిష్మెంట్ ఇస్తారా.. అంటూ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు చిన్నారి పేరెంట్స్.