మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు ముమ్మరం... ఏ2 డాక్టర్ పార్థసారథి కోసం బెంగళూరులో పోలీసుల గాలింపు

మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు ముమ్మరం... ఏ2 డాక్టర్ పార్థసారథి కోసం బెంగళూరులో పోలీసుల గాలింపు

మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు ,ముమ్మరం చేశారు పోలీసులు. శనివారం  ( నవంబర్ 15 ) సంబంధించి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ కేసులో ఏ2గా ఉన్న డాక్టర్ పార్థసారథి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. డాక్టర్ పార్థసారథి బెంగళూరులో ఉన్నట్లు సమాచారం అందడంతో 4 పోలీస్ బృందాలు అతని కోసం బెంగళూరులో ముమ్మరంగా గాలిస్తున్నట్లు సమాచారం. 

ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. పోలీసులు అరెస్ట్ చేసిన ఆరుగురు నిందితులు డాక్టర్‌ కంప ఆంజనేయులు,పిల్లి పద్మ, సత్య, సూరిబాబు, బాలరంగడు, మోహరాజ్‌ లకు ఆదివారం ( నవంబర్ 16 ) వైద్య పరీక్షలు నిర్వహించి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. ఈ క్రమంలో నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు.

కిడ్నీ రాకెట్ కి సంబందించిన మరో 8 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. పరారీలో ఉన్న నిందితుల కోసం నాలుగు బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. తెలంగాణ, గోవా, కర్ణాటకలో గాలింపు జరుపుతున్నట్లు తెలిపారు పోలీసులు.