మీకు SBIలో అకౌంట్ ఉందా.. జాగ్రత్త.. నవంబర్ 30 తర్వాత డబ్బు పంపలేరు..

మీకు SBIలో అకౌంట్ ఉందా.. జాగ్రత్త.. నవంబర్ 30 తర్వాత డబ్బు పంపలేరు..

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో అకౌంట్ ఉందా... అయితే  ఈ వార్త మీకోసమే. SBI కస్టమర్లకు ఒక ప్రకటన చేసింది. నవంబర్ 30, 2025 తర్వాత OnlineSBI  సహా YONO Liteలో mCASH పంపడం, క్లెయిమ్ చేసే సౌకర్యాన్ని బ్యాంక్ నిలిపివేస్తుంది. అంటే SBI కస్టమర్లు ఇకపై వారి అకౌంట్ నంబర్‌ను సేవ్ చేయకుండా mCASH ఉపయోగించి డబ్బు పంపలేరు. అలాగే mCASH లింక్ లేదా యాప్ ద్వారా పంపిన డబ్బును కూడా క్లెయిమ్ చేయలేరు.

SBI వెబ్‌సైట్‌లో ఈ సమాచారాన్ని షేర్ చేసింది. UPI, IMPS, NEFT, RTGS వంటి ఇతర సురక్షితమైన, ఎక్కువాగే ఉపయోగించే డిజిటల్ పద్ధతులను డబ్బు పంపడానికి ఉపయోగించాలని బ్యాంక్ కస్టమర్లను కోరింది. ఈ పద్ధతులు కూడా చాలా సులభం ఇంకా సురక్షితమైనవి. 

mCASH ఎలా ఉపయోగించేవారు : గతంలో కస్టమర్లు Google Play Store నుండి SBI mCash అప్లికేషన్‌ డౌన్‌లోడ్ చేసుకోని తర్వాత  లాగిన్ అవ్వడానికి MPINని ఎంటర్ చేసి, ఈ MPINని SBI mCash యాప్‌లోకి లాగిన్ అవ్వడానికి ఉపయోగించేవారు.

mCASH ఫీచర్స్ : mCASH ద్వారా కస్టమర్లు మరొక స్టేట్ బ్యాంక్ కస్టమర్ పంపిన డబ్బు  పాస్‌కోడ్ ఉపయోగించి క్లెయిమ్ చేసుకోవచ్చు.  క్లెయిమ్ చేసిన డబ్బు  ఏ బ్యాంక్ అకౌంటుకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కస్టమర్లు భవిష్యత్ క్లెయిమ్‌ల కోసం అకౌంట్ నంబర్, IFSC కోడ్‌ను నచ్చినట్లు సేవ్ చేసుకోవచ్చు.

mCASH ఎలా చేస్తుంది : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా mCASH సర్వీస్ ద్వారా కస్టమర్లు ఆన్‌లైన్‌ ఎస్‌బిఐ లేదా స్టేట్ బ్యాంక్ ఎనీవేర్ ద్వారా పంపిన డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ ఉపయోగించి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న ఏ ఎస్‌బిఐ కస్టమర్ అయినా అకౌంట్ నంబర్‌ ఎంటర్ చేసుకోకుండానే ఎవరికైనా డబ్బు పంపవచ్చు. వారు చేయాల్సిందల్లా రిసీవర్ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడిని ఉపయోగించడం.

రిసీవర్ వైపు నుండి, ఏ బ్యాంకులోనైనా అకౌంట్ ఉన్న ఎవరైనా స్టేట్ బ్యాంక్ mCASH మొబైల్ యాప్ లేదా OnlineSBIలో  mCASH లింక్ ద్వారా డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు. పంపినవారు సెలెక్ట్ చేసుకున్న  పద్ధతిని బట్టి రిసీవర్ సేఫ్ లింక్, 8-అంకెల పాస్‌కోడ్‌తో  SMS లేదా ఇమెయిల్‌ అందుకుంటారు.