వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం (నవంబర్ 16 నుంచి 22 వరకు ) రాశి ఫలాలను తెలుసుకుందాం..
మేష రాశి: ఈ వారం, మీ మనస్సు కొంచెం భారంగాఉండే అవకాశం ఉంది. చిన్న తప్పులు కూడా మీ సామాజిక ప్రతిష్టను ప్రభావితం చేస్తాయి. పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. సీనియర్ అధికారులు వారం మధ్యలో మీకు కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. ఇక ఆర్థిక విషయానికొస్తే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అనవసర ప్రయాణాలు.. ఆందోళన కలిగిస్తాయి. వారం చివరిలో కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
వృషభ రాశి : ఈ రాశి వారు ఈ వారం ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉన్నతాధికారులతో మీ సమన్వయం ఎంత బలంగా ఉంటే, పనులను పూర్తి చేయడం సులభం అవుతుంది. చిన్న చిన్న విషయాలకు విబేధాలు పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు మీరు చేస్తున్న పనిపై దృష్టి పెట్టండి. వ్యాపారస్తులకు లాభం రాకపోయినా నష్టం ఉండదు. విద్యార్థుల విషయంలో కేరీర్ పరంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాల్లో మిశ్రమఫలితాలుంటాయి. వారం మధ్యలో నుంచి కొంత ఊరట లభిస్తుంది.
మిథున రాశి : ఈ రాశి వారు ఈ వారంలో కెరీర్ పై దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రతి పనిని ఉత్సాహంగా పూర్తి చేస్తారు. గతంలో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులు అధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. చేపట్టిన పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు.
కర్కాటక రాశి : ఈ రాశి ఈ వారం బిజీబీజీగా గడుపుతారు. కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి... వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
సింహ రాశి : ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు, ఉద్యోగస్తులకు వేతనంతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి, పూర్వీకుల ఆస్థి కలసి వస్తుంది. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
కన్య రాశి : ఈ వారంలో ఈ రాశి వారు అనవసరంగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది.ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబసభ్యుల మద్దతు ఉంటుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగస్తులకు ప్రతికూల ఫలితాలు ఏర్పడుతాయి. వారం మధ్యలో నుంచి కొంత ఉపశమనం పొందే అవకాశం ఉందని పండితులు చెబతున్నారు. వ్యాపారస్తులకు మిశ్రమఫలితాలు ఉంటాయి. ప్రతి విషయాన్ని జీవితభాగస్వామిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి. ఎలాంటి ఆందోళన చెందవద్దు.. ఆధ్యాత్మిక చింతనతో గడపండి అంతా మంచే జరుగుతుంది.
తులారాశి: ఈ రాశి వారికి ఈ వారం ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కొంతమంది ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. పాత మిత్రులు కలుసుఉంటారు. అనుకోకుండా పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు గతంలో ఉన్న ఇబ్బందులు పరిష్కారమవుతాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. వారం చివరిలో అనవసర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈ వారంలో వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం కూడా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. ముఖ్యమైన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిత్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
ధనుస్సు రాశి : ఈ వారం ఈ రాశి వారికి అన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రతి పనిని సవాళ్లతో పూర్తి చేస్తారు. డబ్బు పొదుపు చేస్తారు. . కుటుంబ వ్యవహారాలపై శ్రద్ద చూపాలని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగే అవకాశం ఉంది. కొత్తగా వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇప్పటివరకు ఉన్న కుటుంబసభ్యుల మధ్య వివాదాలు పరిష్కారం అవుతాయి. వారం చివర్లో పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారస్తులకు అన్ని విధాలా బాగుంటుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోండి.
మకర రాశి : ఈ రాశి వారు ఈ వారం ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. కెరీర్ పరంగా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడి పెట్టేందుకు అనుకూల సమయం. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
కుంభ రాశి : ఈ వారం ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఈ వారం మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా పోతుంది. అధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. ఉద్యోగంలో బాధ్యతల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. చేపట్టిన పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు.ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దని పండితులు సూచిస్తున్నారు.
మీన రాశి : ఈ రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులు నెరవేరుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. భూ లావాదేవీల వ్యవహారంలో సానుకూల ఫలితాలుంటాయి. నిరుద్యోగులకు ఆశించన జాబ్ లభిస్తుంది. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పరిస్థితులు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాలు కూడా పరవాలేదనిపిస్తాయి. . ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి.
