మలక్ పేట, వెలుగు: ఐబొమ్మ రవి చంచల్ గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. సినిమాల పైరసీ కేసులో 95 రోజులుగా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఇమ్మడి రవికి మంగళవారం షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. దీంతో బుధవారం జైలు నుంచి అతను విడుదలయ్యాడు. కాగా, రవిపై మొత్తం సైబర్ నేరాల కింద 5 కేసులు ఉన్నాయని, ఈ నేపథ్యంలో పోలీసులు పిలిచిన తేదీల్లో విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని అతని న్యాయవాది తెలిపారు.
కాగా, బెయిల్ షరతులను ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పాస్‌పోర్టును స్వాధీనం చేయాలని, పిలిచినప్పుడు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని, దర్యాప్తుకు సహకరించాలని, ఇంటర్నెట్ ఉపయోగించొద్దని, దేశం విడిచి వెళ్లొద్దని షరతులు విధిస్తూ కోర్టు బెయింల్ మంజూరు చేసింది.
