పాట్నా: గడ్డం పెంచుకుని టోపీ పెట్టుకున్నంత మాత్రాన తనను తీవ్రవాది అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించడం ఏమిటని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. సోమవారం బిహార్ లోని కిషన్ గంజ్ సభలో ఒవైసీ మాట్లాడారు. “ఒవైసీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదని ఒక ఇంటర్వ్యూలో తేజస్వీని అడిగితే.. ‘ఒవైసీ ఎక్స్ ట్రీమిస్ట్’ అని ఆయన అన్నారు.
నేను నా మతాన్ని ఆచరిస్తే తీవ్రవాదినవుతానా? బాబూ.. ‘ఎక్స్ ట్రీమిస్ట్’ అనే పదాన్ని ఇంగ్లీషులో రాయగలవా”అని ఎద్దేవా చేశారు. కాగా, మహాగఠ్ బంధన్ లో చేరేందుకు ఒవైసీ మొదట ఆసక్తి చూపినా, ఆర్జేడీ స్పందించలేదు.
