భారత్ చైనా దేశాల మధ్య 5 ఏళ్లుగా నిలిచిపోయిన విమాన సేవలు ఇవాళ రాత్రి నుండి తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈ చర్యతో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని చెప్పేందుకు సంకేతంగా కనిపిస్తుంది.
అయితే మొదటి విమానం ఈరోజు (అక్టోబర్ 26) రాత్రి 10 గంటలకు కోల్‌కతా నుండి గ్వాంగ్‌జౌ (Guangzhou)కు ఇండిగో విమానం బయలుదేరుతుంది. నవంబర్ 9 నుండి షాంఘై నుండి న్యూఢిల్లీ మధ్య చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ విమానాలు మొదలవుతాయి. నవంబర్ 10 నుండి ఢిల్లీ-గ్వాంగ్‌జౌ మార్గంలో ఇండిగో విమానం మొదలవుతుంది.
1962 యుద్ధం తర్వాత 2020లో కరోనా (COVID-19) మహమ్మారి, లడఖ్ సరిహద్దుల్లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణల కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి, దింతో విమాన సేవలు ఆపేశారు. దీని సంబంధించి పలు చర్చల తర్వాత, సరిహద్దుల్లోని సైనికులను వెనక్కి పిలిచేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.
గత సంవత్సరం ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కలిసిన తర్వాత విమానా సర్వీసులు తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విమాన సర్వీసుల పునఃప్రారంభం మోడీ జిన్‌పింగ్ చర్చల ఫలితంగా చోటుచేసుకుంది. చైనా ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ ఇరు దేశాల ప్రజలు ఒకరినొకరు కలుసుకోవడానికి ఇదొక మంచి చర్య అని చెప్పింది. అలాగే రెండు దేశాల నుండి ప్రయాణించే వారికి ముఖ్యంగా విద్యార్థులకు, వ్యాపారులకు, కుటుంబికులకు కలుసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
2020కి ముందు భారతదేశం - చైనా మధ్య ఏటా 10 లక్షల కంటే ఎక్కువ మంది ప్రయాణికులు నేరుగా అలాగే ఇతర విమాన మార్గాల ద్వారా ప్రయాణించారు. ప్రస్తుతం ఈ విమానాలు వారానికి మూడు సార్లు నడుస్తాయి. అలాగే ప్రయాణికుల డిమాండ్, రద్దీ పెరిగే కొద్దీ విమానాల ట్రిప్పులను కూడా పెంచాలని చూస్తున్నారు. ఈ విమాన సర్వీసుల పునఃప్రారంభం రెండు దేశాల సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి ఒక కీలక అడుగు అని విశ్లేషకులు చెబుతున్నారు.
