దడ పుట్టిస్తున్న ఎబోలా వైరస్.. ఇండియా-ఆఫ్రికా సదస్సు వాయిదా

దడ పుట్టిస్తున్న ఎబోలా వైరస్.. ఇండియా-ఆఫ్రికా సదస్సు వాయిదా

ఆఫ్రికాలో ఎబోలా వైరస్ దడ పుట్టిస్తోంది. కరోనా వైరస్ కు మించి డేంజర్ గా తయారైంది. దీంతో ఆఫ్రికాలో రోజు రోజుకు కేసులు పెరిగుతూ జనాలు మృత్యువాత పడుతున్న పరిస్థితులు. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన ఇండియా-ఆఫ్రికా సదస్సును వాయిదా వేశారు. 

మే 28 నుంచి ఢిల్లీలో 4వ ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్-2026 జరగాల్సి ఉంది. అయితే ఆఫ్రికాలో ఎబోలా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో.. ముఖ్యంగా కాంగో రిపబ్లిక్ లోని సౌత్ కీవు ప్రావిన్స్ లో పెరిగిపోతున్న కేసుల దృష్ట్యా సదస్సును వాయిదా వేశారు. సమ్మిట్ కు సంబంధించిన కొత్త షెడ్యూల్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. 

అయితే ఇండియాలో ఇప్పటి వరకు ఎబోలా కేసులు నమోదు కాలేదు. అయినప్పటికీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రయాణీకులకు టెస్టలు నిర్వహించి.. వైరస్ లేదని కన్ఫమ్ చేసుకున్నాకే వదులుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికలతో దేశ వ్యాప్తంగా జాగ్రత్త చర్యలు చేపట్టింది ప్రభుత్వం. 

ఆఫ్రికా కంట్రీన్ నుంచి వస్తున్న ప్యాసెంజర్స్ ను టెస్టు చేయడం, క్యారంటైన్ కు పంపడం, కేస్ మేనేజ్ మెంట్, ల్యాబొరేటరీ టెస్టింగ్.. మొదలైన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇండియా-ఆఫ్రికా మధ్య దౌత్యపరమైన, ఆర్థికపరమైన, రాజకీయ సంబంధాల పెంపు కోసం ఉద్దేశించి ఏర్పాటు చేసిందే ఈ ఇండియా-ఆఫ్రికా సదస్సు. 

ALSO READ : రన్ వేను ఢీకొట్టిన ఫ్లయిట్ టేల్ పార్ట్.

ఎబోలా  లక్షణాలు..

  • ఎబోలా సోకిన వారిలో సాధారణంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి..
  • తీవ్రమైన జ్వరం ,తలనొప్పి
  • కండరాల నొప్పులు, విపరీతమైన నీరసం
  • గొంతు నొప్పి
  • వాంతులు, విరేచనాలు ,కడుపు నొప్పి
  • వ్యాధి తీవ్రత పెరిగితే ముక్కు లేదా నోటి నుండి రక్తస్రావం వంటివి సంభవిస్తాయి. 

ఆందోళన వద్దు ..

కోవిడ్-19 లాగా ఎబోలా వైరస్ గాలి ద్వారా వ్యాపించదు. ఇది కేవలం సోకిన వ్యక్తి రక్తం, లాలాజలం, చెమట లేదా ఇతర శారీరక ద్రవాలను నేరుగా తాకడం ద్వారా మాత్రమే ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. అందువల్ల సాధారణ ప్రయాణికులకు లేదా ప్రజలకు దీని రిస్క్ చాలా తక్కువని ఎయిమ్స్ ,మెదాంత వైద్య నిపుణులు స్పష్టం చేశారు.