బెంగళూర్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో విమానం తోక భాగం నేలకు (టెయిల్ స్ట్రైక్) తాకింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని నిలిపివేశాడు. ప్రయాణికులు, సిబ్బందితో సహా విమానంలో ఉన్న మొత్తం 179 మంది సురక్షితంగా బయపడ్డారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, ఎయిర్ లైన్స్ సిబ్బంది, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
గురువారం (మే 21) ఢిల్లీ నుంచి బెంగళూరు వచ్చిన ఎయిరిండియా AI2651 ఫ్లైట్ బెంగళూర్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సమయంలో టెయిల్ స్ట్రైక్‌కు గురైనట్లు ఎయిర్ ఇండియా ధృవీకరించింది. ల్యాండ్ అవుతోన్న సమయంలో ఫ్లైట్ తోక భాగం రన్‌వేను బలంగా ఢీకొట్టింది. పైలట్ల అప్రమత్తతతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
ALSO READ : గంటకు రూ.350.. AI కోసం డేటా కలెక్షన్ చేస్తూ లక్షల్లో సంపాదన..
ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 179 మంది ఉన్నారు. ఈ ఘటన అనంతరం సమగ్ర తనిఖీ కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. ఢిల్లీకి దాని తిరుగు ప్రయాణాన్ని కూడా రద్దు చేశారు. ప్రయాణికులకు వీలైనంత త్వరగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని.. మా ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొంది.
