ఈ స్టోరీ చదివితే నిజంగా ఇలాంటి ఐడియాలు మనకెందుకు రావబ్బా అనుకోకుండా ఉండలేం. ఎందుకంటే ఏఐతో జాబ్స్ పోతున్నాయ్.. పని తగ్గుతుంది అనుకునే వాళ్లే కానీ.. ఈ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఎలా సంపాదించాలో ఆలోచించే వారు తక్కువే. అలాంటి కంప్లైట్స్ ఏవీ లేకుండా ఎంచక్కా రోజుకు లక్ష రూపాయలకు పైగా సంపాదిస్తున్న పోరడు ఇప్పుడు హాట్ టాపిగ్ గా మారాడు. అతని AI డేటా కలెక్షన్ వీడియో వైరల్ గా మారింది. ఈ బెంగళూరు కూరగాయల పోరడు ఎలా టాక్ ఆఫ్ ది కంట్రీగా మారాడో చూద్దాం.
ఈ కూరగాయల చిన్న వ్యాపారి పేరు వైభవ్. ఏఐ డేటా కలెక్ట్ చేస్తూ గంటకు350 రూపాయలు సంపాదిస్తున్నాడు. అంటే నెలకు అక్షరాల లక్ష రూపాయలు జేబులో వేసుకుంటున్నాడు. పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు సాధ్యం కానిది ఈ కుర్రోడు చేసి చూపించి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాడు.
ఏఐ కోసం డేటా సేకరణ:
ఇన్ స్టా గ్రామ్ లో ఏఐ డేటా కలెక్ట్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. తలపైన డివైజ్ పెట్టుకుని కస్టమర్లతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఏఐకి రియల్ వరల్డ్ డేటా సేకరిస్తున్నాడు అన్నమాట. ఏఐ మోడల్స్ తయారు చేసే కంపెనీలకు పెద్ద మొత్తంలో గ్రౌండ్ లెవల్ రియల్ వరల్డ్ డేటా అవసరం ఉంటుంది. తలపైన పెట్టుకునే కెమెరా, గేర్స్, మైక్రోఫోన్స్ సహాయంతో వీడియో క్యాప్చర్ చేస్తూ డేటా సేకరిస్తున్నాడు. పని చేస్తూనే తను చేసే పనిని కూడా ఏఐ డేటా కోసం సేకరిస్తున్నాడు.
డేటా సేకరణ ఎలా..
అంతే కాకుండా.. టౌన్ లో తిరుగుతూ.. వివిధ వస్తువులు, జంతువులు, వాతావరణ పరిస్థితులు, చుట్టూ ఉన్న పరిసరాలు ఇలా వివరిస్తూ వీడియో షూట్ చేస్తుంటాడు. ముఖ్యంగా కూరగాయల వ్యాపారానికి సంబంధించి.. వివిధ రకాల కూరగాయల గురించి వీడియో క్యాప్చర్ చేస్తూ వివరాలు వెల్లడిస్తున్న వీడియో వైరల్ గా మారింది. కూరగాయల షాప్ ముందు కూర్చుని.. తలకు ఐఫోన్, ఏఐ డేటా సేకరణ డివైజ్ లకు కనెక్ట్ చేసుకుని వీడియో క్యాప్చర్ చేస్తున్నాడు. ఈ వీడియో మిలియన్ల వ్యూస్ తో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఐడియాలు మనకెందుకు రావు అనుకుంటున్నారు నెటిజన్లు. ఎవరి ఫీల్డ్ లో వారి పనులకు సంబంధించి డేటీ సేకరించి ఏఐ కంపెనీలకు అమ్ముకోవచ్చు కదా. ఇప్పుడు అందరూ ఇదే ఆలోచనలో పడ్డారు.
ALSO READ : పెట్రోల్ బైక్ vs ఎలక్ట్రిక్ బైక్: ఏది బెస్ట్..?
గంటలకు రూ.350.. రోజుకు రూ.3 వేల 500..
దీనిపై నెటిజన్లు ఫుల్ కామెంట్స్ చేస్తున్నారు. వీడియో తీసిన ఒక వ్యక్తి.. ఏ చేస్తున్నావని అబ్బాయిన ప్రశ్నిస్తే.. ఏఐ కోసం డేటా కలెక్ట్ చేస్తున్నట్లు చెప్పాడు. ఏంటి లాభం అంటే.. గంటకు 350 రూపాయలు ఇస్తారట. అంటే రోజుకు 10 గంటలు పనిచేసినా 3 వేల 500. అంటే నెలకు లక్ష 5 వేల రూపాయలు (1,05,000) సంపాదన. అది విని నోరెళ్లబెట్టాడంట.కార్పోరేట్ ఇండియా సంపానలో సగానిపైగా వీధి వ్యాపారి సంపాదించడం ఆశ్చర్యానికి గురిచేసిందని పోస్ట్ చేశాడు. ఈ వీడియో క్లిప్ వితిన్ హవర్స్ లో 50 లక్షల వ్యూస్ తో ట్రెండిగ్ గా మారింది.
