భారత ఫుట్బాల్ జట్టు హిస్టరీలో ఫస్ట్ టైం

భారత ఫుట్బాల్ జట్టు హిస్టరీలో ఫస్ట్ టైం

ఇండియన్ ఫుట్బాల్ టీమ్ చరిత్ర సృష్టించింది. మొట్టమొదటి సారిగా FIFAe  నేషన్స్ కప్ 2022 టోర్నీకి ఫుట్బాల్ జట్టు అర్హత సాధించింది. FIFAe నేషన్స్ సిరీస్ 2022 ప్లే ఆఫ్ మ్యాచుల్లో  భారత ఈఫుట్బాల్ టీమ్ కొరియా రిపబ్లిక్, మలేషియా జట్లను ఓడించి అర్హత పొందింది. ఈస్పోర్ట్స్ షోపీస్ ఈవెంట్ జూలై 27 నుంచి 30 వరకు డెన్మార్క్ లోని కోపెన్ హాగల్లో జరగనుంది. 

FIFAe నేషన్స్ సిరీస్ 2021 కోసం ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ FIFAతో భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసింది. దీంతో గత ఏడాది జనవరిలో ఇండియన్ ఫుట్బాల్ టీమ్ ఈస్పోర్ట్స్  షోపీస్  ఈవెంట్లో స్థానమే లక్ష్యంగా  ప్రయాణం ప్రారంభించింది.  భారత ఫుట్బాల్ జట్టు 60 దేశాలతో కలిసి మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా జోన్లో ప్లేస్ దక్కించుకుంది. ఈ జోన్లో టీమిండియా మూడో స్థానంతో సరిపెట్టుకుంది.  దీంతో  FIFAe నేషన్స్ ప్లేఆఫ్‌  2021లో చోటు దక్కించుకోలేకపోయింది.  అయితే  గ్లోబల్ ర్యాంకింగ్లో మాత్రం 22వ స్థానంతో సీజన్‌ను ముగించింది.

2022 సీజన్ కోసం భారత జట్టు ఆసియా,ఓసియానియా జోన్కు మారింది. నాలుగు వారాల పాటు జరిగిన ప్లేఆఫ్లో భారత్ 32 గేమ్స్ లో ఆడింది. ఇందులో 12 గేమ్స్లో గెలిచి..11 గేమ్స్ ఓడింది. తొమ్మిదింటిని డ్రాగా ముగించింది. దీంతో కాన్సిస్టెన్సీ పాయింట్ల చార్ట్లో భారత్ రెండో స్థానంలో నిలిచి ప్లేఆఫ్కు అర్హత సాధించింది. అటు గ్లోబల్ ర్యాంకింగ్ లో19వ ప్లేస్ ను దక్కించుకుంది.  ఇక ప్లేఆఫ్లో రెండు మ్యాచుల్లో గెలిచి..FIFAe నేషన్స్ కప్ 2022కి అర్హత పొందింది.