మిడిల్ ఈస్ట్ టెన్షన్లు, ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఎంపీసీపై ఫోకస్‌‌‌‌

మిడిల్ ఈస్ట్ టెన్షన్లు, ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఎంపీసీపై ఫోకస్‌‌‌‌

న్యూఢిల్లీ: ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఎంపీసీ మీటింగ్‌‌‌‌,  మిడిల్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌లో కొనసాగుతున్న టెన్షన్లు ఈ వారం మార్కెట్‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌ను నిర్ణయించనున్నాయి. ఫారిన్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌ఐఐ) గత కొన్ని సెషన్లుగా నికర అమ్మకందారులుగా మారారు. ఇది ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్‌‌‌‌ను దెబ్బతీస్తోంది. మరోవైపు తమ సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ రిజల్ట్స్‌‌‌‌ను ప్రకటించడానికి కంపెనీలు రెడీ అయ్యాయి. టీసీఎస్‌‌‌‌ రిజల్ట్స్ సీజన్‌‌ను ప్రారంభించనుంది. డొమెస్టిక్ ఎకనామిక్ డేటా, క్రూడాయిల్ కదలికలు మార్కెట్‌‌‌‌పై ప్రభావం చూపనున్నాయి. ఇజ్రాయిల్‌‌‌‌ – ఇరాన్ మధ్య గొడవ ముదరడం, ఎఫ్‌‌‌‌ఐఐలు నికర అమ్మకందారులుగా మారడంతో కిందటి వారం బెంచ్‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌లు భారీగా పడ్డాయి.

సెన్సెక్స్ 3,883 పాయింట్లు (4.53 శాతం), నిఫ్టీ 1,164 పాయింట్లు (4.44 శాతం) పతనమయ్యాయి. దేశీయంగా చూస్తే ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఎంపీసీ  మీటింగ్ ఈ నెల 7–9 మధ్య జరగనుంది. ఇన్‌‌‌‌ఫ్లేషన్ ఇంకా గరిష్టాల్లోనే ఉంది.  మిడిల్ ఈస్ట్ టెన్షన్ల వలన క్రూడ్ ధరలు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ టైమ్‌‌‌‌లో వడ్డీ రేట్లను ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ తగ్గించకపోవచ్చని మార్కెట్ భావిస్తోంది.  ఈ వారం ఇండియా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా,  యూఎస్‌‌‌‌ ఫెడ్ మీటింగ్ మినిట్స్‌‌‌‌,  ఇనీషియల్ జాబ్‌‌‌‌లెస్‌‌‌‌ క్లెయిమ్స్ డేటా, యూకే జీడీపీ డేటా విడుదల కానున్నాయి. 

రూ.27,142 కోట్ల షేర్లు అమ్మిన ఎఫ్‌‌‌‌పీఐలు..

ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌పీఐలు)  ఈ నెలలోని మొదటి మూడు ట్రేడింగ్ సెషన్లలో నికరంగా రూ.27,142 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.  ఇజ్రాయిల్‌‌‌‌ – ఇరాన్ మధ్య గొడవ ముదరడం, క్రూడాయిల్ ధరలు పెరుగుతుండడం, చైనీస్ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉండడంతో వీరు నికర అమ్మకందారులుగా మారారు. ఇండియా మార్కెట్‌‌‌‌లో ప్రాఫిట్స్‌‌‌‌ను బుక్ చేసుకుంటున్నారు. కిందటి నెలలో నికరంగా రూ.57,724 కోట్లను ఎఫ్‌‌‌‌పీఐలు ఇండియా మార్కెట్‌‌‌‌లో ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు