ఒక్కరోజు కూడా స్కూల్‌ మిస్ కాకుండా.. 50 దేశాలను చుట్టేసిన 10 ఏళ్ల బాలిక

ఒక్కరోజు కూడా స్కూల్‌ మిస్ కాకుండా.. 50 దేశాలను చుట్టేసిన 10 ఏళ్ల బాలిక

అదితి త్రిపాఠి అనే 10 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి ఇప్పటికే 50 దేశాలను సందర్శించింది. అది కూడా ఒక్కరోజు కూడా స్కూల్‌ మిస్ కాకుండా. Yahoo Life UK ప్రకారం , తన తండ్రి దీపక్, తల్లి అవిలాషాతో కలిసి సౌత్ లండన్‌లో నివసిస్తున్న అదితి.. యూరప్‌లోని చాలా ప్రాంతాలను సందర్శించింది. అంతే కాదు నేపాల్, సింగపూర్, థాయ్‌లాండ్ వంటి ప్రదేశాలకు కూడా చుట్టేసి వచ్చింది.

అవుట్‌లెట్ ప్రకారం, అదితి తల్లిదండ్రులు తమ బిడ్డ బాగా అన్ని ప్రదేశాలను చూడాలని.. అందుకు తగ్గట్టుగా కూడా వారు ప్లాన్ చేశారు. పాఠశాలలో ఎలాంటి డిస్ కంటిన్యూ లేకుండా ఆమె ప్రపంచాన్ని చుట్టేయాలని, విభిన్న సంస్కృతులు, ఆహారాలు, వ్యక్తులను ఆమె చూడాలని వారు కోరుకున్నారు. దీనికనుగుణంగా వారు ఒక ప్రణాళికను కూడా రూపొందించారు. పాఠశాలకు సెలవు సమయంలో వారు ప్రయాణం చేసేవారు. బ్యాంకు సెలవులను కూడా ఉపయోగించుకుని పర్యటన చేసేవారు. అదితి తల్లిదండ్రులు ప్రయాణానికి సంవత్సరానికి 20వేల పౌండ్లు ( రూ. 21 లక్షలకు పైగా) ఖర్చు చేస్తారని అంచనా. అయితే ప్రతి పైసా విలువైనదనేనని కూడా వారు చెబుతుంటారు.

"నేపాల్, భారతదేశం, థాయ్‌లాండ్ వంటి విభిన్న సంస్కృతులను చూసి ఆమె ఆసక్తిగా, ఉత్సాహంగా ఉంటుంది. ఆమె మూడేళ్ల వయస్సులో నర్సరీలో ఉన్నప్పుడు మేము ఆమెతో ప్రయాణం ప్రారంభించాం. అలా ఆమె వారానికి రెండున్నర రోజులు పాఠశాలకు వెళ్లేది" అని త్రిపాఠి చెప్పారు. మేము ఆమెను శుక్రవారం పాఠశాల నుంచి నేరుగా తీసుకువెళతాం. ఆదివారం రాత్రి 11 గంటలకు తిరిగి లేట్ నైట్ ఫ్లైట్ వచ్చేస్తాం. కొన్నిసార్లు సోమవారం ఉదయం కూడా వచ్చిన రోజులున్నాయి. మరికొన్ని సార్లు ఆమె విమానాశ్రయం నుంచి నేరుగా పాఠశాలకు వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి ” అని ఆయన వెల్లడించారు.

పలు నివేదికల ప్రకారం.. అదితి తల్లిదండ్రులు అకౌంటెంట్లుగా పని చేస్తారు. వారు తమ ప్రయాణాల కోసం ఏడాది పొడవునా పొదుపు చేస్తారు. అదితి 2 ఏళ్ల సోదరి అద్విత కోసం ప్రయాణ ఖర్చులు, పిల్లల సంరక్షణ కోసం వారు బయట భోజనం చేయడం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌పై ఆధారపడటం, స్వంత కారును కలిగి ఉండకుండా ఇంటి నుంచి పని చేస్తున్నారు. కొవిడ్‌కి ముందు, త్రిపాఠి ఒక సంవత్సరంలో సుమారు 12 ప్రదేశాలకు వెళతారని వెల్లడించారు. అదితి యుక్తవయస్సులో ఉన్నప్పటికీ యూరప్‌లోని దాదాపు అన్ని దేశాలతో పాటు థాయ్‌లాండ్, ఇండోనేషియా, సింగపూర్‌లను సందర్శించినట్లు ఆయన చెప్పారు.

"నాకు ప్రత్యేకమైన ఇష్టమైన దేశం లేదా ప్రదేశం అంటూ ఏమీ లేదు. కానీ నేను మూడు ప్రదేశాలు చెప్పమని అంటే మాత్రం అవి నేపాల్, జార్జియా, ఆర్మేనియా" అని అదితి తెలిపింది. "నేపాల్ బహుశా నాకు ఇష్టమైన వాటిలో ఒకటి. ఎందుకంటే నేను గుర్రపు స్వారీ చేశాను. అక్కడ పొడవైన కేబుల్ కారులో వెళ్ళాను. ఎవరెస్ట్ పర్వతం వంటి పర్వతాలను చూడగలిగాను. నాకు ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం. దాని వల్ల చాలా ఆహ్లాదకరమైన జ్ఞాపకాలు మిగిలాయి. నేను దీన్ని ఇతర పిల్లలకు కూడా సిఫార్సు చేస్తాను. ఎందుకంటే ఇది మీ సామాజిక నైపుణ్యాలకు నిజంగా సహాయపడుతుంది" అని ఆమె చెప్పుకొచ్చింది.

అదితి తన మూడు సంవత్సరాల వయసులో జర్మనీకి వెళ్ళింది. త్వరలో వారు ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియాలను కూడా సందర్శించనున్నట్టు సమాచారం.