బిల్లీ జీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో మరోసారి ప్లే ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్యంగా.. ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టు

బిల్లీ జీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో  మరోసారి ప్లే ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్యంగా.. ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టు

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక బిల్లీ జీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసియా/ ఓషియానియా గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–1 టోర్నీ కోసం ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టు రెడీ అయ్యింది. తెలంగాణ ప్లేయర్లు శ్రీవల్లి భమిడిపాటి, సహజ యమలపల్లితో పాటు  రుతుజా భోసలే, వైదేహి చౌదరీ, వైష్ణవి అడ్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అంకితా రైనా ఈ టోర్నీతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నెల 7 నుంచి 11 వరకు ఢిల్లీలో జరగనున్న ఈ పోటీల కోసం వీళ్లంతా  ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టారు. గతేడాది తొలిసారి ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించిన ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈసారి అంతకంటే మెరుగైన పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.

వైష్ణవి అడ్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరంగేట్రం చేయనుంది. 2025–26 సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అద్భుతంగా ఆడిన వైష్ణవి 600 ర్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి దూసుకొచ్చింది. ఈ టోర్నీ కోసం ఆమె రోజుకు రెండు సెషన్లలో ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. గాయం నుంచి కోలుకుని వచ్చిన వైదేహి చౌదరీతో పాటు గతేడాది వరుసగా ఐదు విజయాలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీవల్లిపై భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాది టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–300లో చోటు సంపాదించి గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్హత పోటీల్లో ఆడాలని వైదేహి లక్ష్యంగా పెట్టుకుంది. అనుభవం, యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తమ జట్టు మంచి సమతూకంతో ఉందని కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విశాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధీమా వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు