జాతీయ ఉత్త‌మ టీచర్ గా ఇందిరానగర్ హెడ్మాస్టర్ రామస్వామి

 జాతీయ ఉత్త‌మ టీచర్ గా ఇందిరానగర్ హెడ్మాస్టర్ రామస్వామి

కేంద్ర ప్రభుత్వ అవార్డుకు ఎంపికయ్యారు సిద్దిపేట ఇందిరానగర్ జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ రామస్వామి. దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులు 44 మందిని అవార్డు కోసం ఎంపిక చేసింది ప్రభుత్వం. ఇందులో రామస్వామికికి చోటు దక్కింది.
 
మొక్కుబడిగా పాఠాలు చెప్పంకుండా క్లాసులోని ఒక్కో విద్యార్థి పై ప్రత్యేక శ్రధ్ద పెడుతుంటారు టీచర్ రామస్వామి. విద్యార్థుల ప్రవర్తనను గమనించడంతో పాటు ఇంటి దగ్గరి విషయాలు తెలుసుకొని ... ఇంట్లో సమస్యలు పిల్లల చుదువుపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలా చదువులో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా ప్రోత్సహిస్తుంటారు. 

2015లో ఈ పాఠశాలకు రామస్వామి టీచర్ గా వచ్చే నాటికి 300 మంది విద్యార్థులు ఉన్నారు.. ఈ సంఖ్య ఇప్పుడు 1130 మందికి చేరింది. అప్పట్లో  8 సెక్షన్లు ఉంటే ఇప్పుడు 23 సెక్షన్లున్నాయి. కార్పొరేట్  విద్యాసంస్థల స్థాయిలో నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలలు కూడా అందిస్తాయని నిరూపించారు రామస్వామి మాస్టర్. విద్యారంగంపై జాతీయ స్థాయిలో ఢిల్లీలో జరిగిన పలు సెమినార్లకు రామస్వామికి ఆహ్వానాలు వచ్చాయి.. జాతీయ స్థాయిలో పలు అవార్డులు వచ్చాయి. పాఠశాల గేటుకు అడ్మిషన్లు లేవు అని బోర్డు పెట్టే స్థాయికి పాఠశాలను చేర్చిన ఘనత రామాస్వామి మాస్టర్ ది. ఇందులో భాగంగా ఈయనకు జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 

కంప్యూటర్ , ఇంగ్గిష్ , ఆరోగ్యం,వ్యక్తిత్వ వికాసం అంశాలపై రామస్వామి మాస్టర్ కు గట్టి పట్టుంది. బడి నిర్వహణలో సమూలంగా మార్పులు తెచ్చారు. బడి వేళలను రెండు గంటలు పొడిగించారు. అన్ని పాఠశాలలకు భిన్నం గా ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు బడి నడిపిస్తున్నారు. పాఠశాల అభివృద్ధి కోసం మంత్రి హరీశ్  సహాయం తీసుకున్నారు. నాట్కో వంటి కార్పొరేట్  సంస్థల సహకారంతో  అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రయత్నించారు.  డిజిటల్  ల్యాబ్ , మల్టీపర్పస్  కంప్యూటర్  ల్యాబ్ , సైన్స్  ల్యాబ్ లను ఏర్పాటు చేయించారు. కార్పొరేట్ స్కూల్ కంటే ఎక్కువ సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేశారు. 

విద్యార్థుల సంఖ్య పెరగడంతో  మరో 4 గదులను మంజూరు చేయించారు. కొత్తగా ఆరుగురు ఉపాధ్యాయులను ఇక్కడికి రప్పించేలా చర్యలు తీసుకున్నారు. ఆన్ లైన్  తరగతులు అర్థం కాని పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ స్కూల్ లో 6వ తరగతికి మాత్రమే  ప్రవేశాలు నిర్వహిస్తారు. ఇందులో నాలుగు సెక్షన్లలో 160 సీట్లు ఉండగా   600పైగా దరఖాస్తులు వస్తుంటాయి.  

ఈ స్కూల్ లో  చదివే పిల్లలు ఇంగ్లిష్ లోనే మాట్లాడతారు. వీరికి కంప్యూటర్ , సైన్స్ , రోబోటిక్స్ , గూగుల్  కోడింగ్ , యోగా అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బాసరలోని ట్రిపుల్  ఐటీలో మండలానికి ఆరు చొప్పున సీట్లు మంజూరు చేస్తుంటారు. సిద్దిపేట మండలానికి చెందిన 6 సీట్లను ఈ పాఠశాల విద్యార్థులే దక్కించుకున్నారు. టీంవర్క్  ఒక్కటే మన ఆయుధం అంటూ తోటి ఉపాధ్యాయిలను ప్రోత్సహిస్తుంటారు  రామస్వామి మాస్టర్. ఆయన సేవలకు జాతీయ స్థాయి అవార్డు రావడం సంతోషంగా ఉందంటున్నారు  తోటి ఉపాధ్యాయులు.