విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ కాంబోలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా టైటిల్ గ్లింప్స్ను ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది. గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ గ్లింప్స్లో VD14 సినిమా పేరును రణబాలి అని ప్రకటించారు.
పీరియాడిక్ డ్రామా జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా బ్యాక్ డ్రాప్, కోర్ పాయింట్ ఏంటనే విషయాలను ఈ గ్లింప్స్తో చెప్పేశారు. ఈ సినిమా భారతదేశ స్వతంత్ర్య సంగ్రామ కథ కాదని.. స్వరాజ్యం సిద్ధించక ముందు కాలగర్భంలో కలిసిపోయిన ఒక చీకటి అధ్యాయం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ గ్లింప్స్తో ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చేశాడు.
చరిత్ర పుటల్లో హిట్లర్ అనే నియంత సృష్టించిన మారణ హోమం కంటే దారుణంగా.. మన దేశంలో, బ్రిటీష్ పాలనలో సాగిన నరమేధం ఈ సినిమాలో చూపించబోతున్నట్లు గ్లింప్స్తో దర్శకుడు చెప్పేశాడు. ఆ మారణ కాండకు ఎదురుతిరిగిన ఒక వీరుడి కథను ఈ సినిమాలో చూపించాలని దర్శకుడు నిర్ణయించుకున్నట్లు విజయ్ పాత్ర చెప్పకనే చెప్పింది. రష్మిక మందన కూడా ఈ సినిమాలో జయమ్మ అనే పాత్ర పోషిస్తుండటం విశేషం. అంతేకాదు.. ఈ సినిమాతో బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్-అతుల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.
►ALSO READ | Varun Dhawan: ముంబై మెట్రోలో వరుణ్ ధావన్ విన్యాసాలు.. స్టంట్‌లు చేస్తే శిక్షకు అర్హులంటూ అధికారులు ఫైర్
పాన్ ఇండియా సినిమాగా రణబాలి విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీని కూడా మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించడం విశేషం. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రణబాలి సినిమాను విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భావిస్తోంది. విడుదల తేదీని కూడా టైటిల్ గ్లింప్స్లో ప్రకటించడం గమనార్హం.
రణబాలి గ్లింప్స్ అయితే ఆసక్తి రేకెత్తించింది. చాలామందికి తెలియని ఒక కొత్త కథను చెప్పేందుకు దర్శకుడు ముందుకొచ్చాడు. అయితే.. ఒకటి మాత్రం ఈ గ్లింప్స్తో స్పష్టంగా అర్థమైంది. బండి నారాయణ స్వామి రాసిన రాయలసీమ చారిత్రక నవల శప్తభూమి ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని గ్లింప్స్తో ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
