టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ రెండోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. పూర్ణ మూడు సంవత్సరాల క్రితం దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షనిద్ ఆసిఫ్ని రహస్యంగా వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు మరోసారి ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ శుభవార్తను కొద్ది రోజుల క్రితమే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
Fame may shine, but motherhood is my true crown. As I wait for my second little miracle, my heart smiles knowing a loving big brother is ready to welcome a new best friend into this world. #mother #pregnancy pic.twitter.com/f8f4eVI31W
— Purnaa (@shamna_kkasim) January 21, 2026
ఈ సందర్భంగా, లేటెస్ట్గా బేబీ బంప్‌తో తీసుకున్న ఫొటోలను పూర్ణ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పూర్ణ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ALSO READ : ప్రభాస్ ‘స్పిరిట్’లో చిరంజీవి ఎంట్రీ..?
ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించిన పూర్ణ, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస అవకాశాలతో బిజీగా ఉంది. ఇటీవల నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2: తాండవం’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. అంతేకాదు, పలు స్టేజ్ షోలు, టెలివిజన్ కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.
