MM Keeravani: మగాళ్ల మీద జాలిపడేదెవ్వరు? 'పురుషః' కోసం కీరవాణి మ్యూజికల్ ట్రీట్!

MM Keeravani: మగాళ్ల మీద జాలిపడేదెవ్వరు? 'పురుషః' కోసం కీరవాణి మ్యూజికల్ ట్రీట్!

టాలీవుడ్‌లో వైవిధ్యమైన టైటిల్స్, ఆసక్తికరమైన పోస్టర్లతో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంటాయి. ఇప్పుడు అదే కోవలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది 'పురుషః' (Purushaha). 'ప్రతీ మగాడి యుద్ధం వెనుక ఓ ఆడది ఉంటుంది' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రం, టైటిల్‌తోనే సగం క్యూరియాసిటీని పెంచేసింది. పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా వెండితెరకు పరిచయమవుతున్న ఈ కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్, ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఎం.ఎం. కీరవాణి పాడిన "మగాళ్ల మీద జాలిపడేదెవ్వరు" అనే పాట నెట్టింట వైరల్ అవుతోంది.

కథా నేపథ్యం.. బ్రహ్మచారి నుంచి భర్తగా మారితే?

ఈ సినిమా ఇతివృత్తం చాలా ఆసక్తికరంగా ఉండబోతోందని చిత్రబృందం విడుదల చేసిన రషెస్ చూస్తే అర్థమవుతోంది. స్వేచ్ఛగా బతికే ఒక బ్రహ్మచారి, పెళ్లయి భర్తగా మారిన తర్వాత అతని జీవితంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పులేమిటి? తన స్వేచ్ఛ కోసం ఆ భర్త చేసే అలుపెరుగని పోరాటం ఎలాంటి మలుపులు తిరిగింది? అనే అంశాలను దర్శకుడు అత్యంత హాస్యభరితంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. "దమ్ముంటే నన్ను టచ్ చెయ్" అని భార్య అనడం, "ఒక్క రాంగ్ బటన్ నొక్కితే రిజల్ట్ ఇలా ఉంటుందా భయ్యా" అని హీరో ఆవేదన చెందడం వంటి అంశాలు సగటు ప్రేక్షకుడికి, ముఖ్యంగా యువతకు బాగా కనెక్ట్ అవుతున్నాయి.

కీరవాణి గాత్రంతో పెరిగిన బజ్!

ఈ 'పురుషః' సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తోంది సంగీతం. తాజాగా ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి పాడిన "మగాళ్ల మీద జాలిపడేదెవ్వరు" అనే పాట నెట్టింట వైరల్ అవుతోంది. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాట లిరిక్స్ మగాళ్ల గుండె కోతను ఆవిష్కరిస్తూనే, ఆడవాళ్లను ఆలోచింపజేసేలా ఉన్నాయి. కీరవాణి గొంతులో ఉన్న ఆ గాంభీర్యం, పాటలోని వ్యంగ్యం ఈ సినిమా స్థాయిని ఒక్కసారిగా పెంచేసింది.

 గ్యారెంటీ నవ్వులు!

హీరో పవన్ కళ్యాణ్ బత్తులకి ఇది తొలి సినిమా అయినా, అతని ఎనర్జీ లెవల్స్ మెప్పించేలా ఉన్నాయి. అతనికి తోడుగా టాలీవుడ్ టాప్ కమెడియన్లు సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ లీడ్ రోల్స్ చేస్తుండటంతో వినోదానికి లోటుండదని స్పష్టమవుతోంది. వీరితో పాటు వెన్నెల కిశోర్, వీటీవీ గణేష్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కామెడీ కింగ్‌లు సినిమాలో ఉన్నారు.రాజీవ్ కనకాల, అనంత్ శ్రీరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ హీరోయిన్లుగా నటిస్తూ గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోనున్నారు.

నిర్మాణ విలువలపై ధీమా!

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వర రావు ఈ 'పురుషః' చిత్రాన్ని అత్యంత ఉన్నత ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా, నేటి సమాజంలో భార్యాభర్తల సంబంధాల మధ్య ఉండే సున్నితమైన అంశాలను కమర్షియల్ హంగులతో జోడించి ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సోషల్ మీడియాలో భారీ వ్యూస్ సాధించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. వైవిధ్యమైన కంటెంట్‌తో వస్తున్న ఈ 'పురుషః' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి. ముఖ్యంగా ఎం.ఎం. కీరవాణి సాంగ్ ఇచ్చిన బూస్ట్‌తో ఈ సినిమా 2026 ప్రథమార్ధంలో ఒక క్రేజీ హిట్‌గా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.