దక్షిణాది చిత్ర పరిశ్రమలో మిల్కీబ్యూటీ తమన్న కెరీర్ ఎలా సాగిందన్నది చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ చిత్రాల్లో తనదైన ముద్ర వేసింది. హ్యాపీడేస్ సినిమాతో వెలుగులోకి వచ్చిన ఈ అమ్మడు రెండు భాషల్లోనూ సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగించింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. హీరోయిన్ అవకాశాలే కావాలని కూర్చోలేదు. వచ్చిన పాత్రలతో సంతృప్తి చెందింది.
సౌత్‌కు బ్రేక్.. బాలీవుడ్‌కు జై!
ఈ క్రమంలో ఐటం భామగాను అవతారం ఎత్తింది. అక్కడా తనదైన ముద్ర వేసింది. తమిళ, తెలుగు సినిమాలతో పాటు సెకండ్ ఇన్నింగ్స్ లో హిందీలోనూ బాగానే నటించింది. అయితే కొత్త ఏడాదిలో ఈ బ్యూటీ కొత్తగా ప్లాన్ చేస్తోందట. తన గ్లామర్ అభినయంతో ఉర్రూతలూగించిన ఈ బ్యూటీ ఇప్పుడు తన ఫోకస్ ను పూర్తిగా బాలీవుడ్ వైపు మళ్లించింది. సౌత్ సినిమాల ద్వారా స్టార్ స్టేటస్ అందుకున్న తమన్నా, తన సెకండ్ ఇన్నింగ్స్‌లో బాలీవుడ్లో తిరుగులేని ముద్ర వేయాలని గట్టి పట్టుదలతో ఉందని టాక్ వినిపిస్తోంది.
స్టార్ మేకర్స్ దృష్టిలో మిల్కీ బ్యూటీ
సౌత్ సినిమాలు తగ్గించి బాలీవుడ్ లో సీరియస్ గా పని చేయాలని నిర్ణయించుకుందట తమన్న... ఒకే సారి మూడు భాషల్ని మ్యానేజ్ చేయడం కష్టంగా ఉందట. దీంతో బాలీవుడ్ కి దూరం అవుతున్నాననే ఆలోచన నుంచి ఈ ముద్దుగుమ్మ మనసు మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు బాలీవుడ్లో కంటెంట్ ఓరియెంటెడ్ పాత్రలు, వెబ్ సిరీస్‌ల వైపు మొగ్గు చూపుతోంది.
Also Read : బాక్సాఫీస్ రికార్డుల వేటలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’..
తమన్నా ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న ఓ సినిమాతో పాటు.. కరీనా కపూర్ 'క్రూ 2'. 'గోల్ మాల్ 5' , మడాక్ ఫిలిమ్స్ హారర్ కామెడీ యూనివర్స్ లో భాగమవ్వాలని ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఇప్పటికే ఆ చిత్రాల దర్శక, నిర్మాతలకు టచ్ లోకి వెళ్లిందట. ఈ పథ్యంలోనే కార్తీక్ ఆర్యన్ నటిస్తోన్న నాగ్ జిల్లా ప్రాజెక్టును కావాల నాగ్ కావాలనే వదులుకుందటని టాక్ వినిపిస్తోంది . మొత్తానికి, దక్షిణాదిలో 'కావాలయ్యా' అంటూ స్టెప్పులేయించిన ఈ సుందరి, ఇకపై ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమైంది. మరి 2026లో తమన్నా బాలీవుడ్ కలలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి!
