Pawan Kalyan: బాక్సాఫీస్ రికార్డుల వేటలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. పవర్ స్టార్ రిలీజ్ డేట్ ఫిక్స్!

Pawan Kalyan: బాక్సాఫీస్ రికార్డుల వేటలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. పవర్ స్టార్ రిలీజ్ డేట్ ఫిక్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు  హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. వీరిద్దరి కలయికతో గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదే కాంబినేషన్ లో'ఉస్తాద్ భగత్ సింగ్' రెడీ అవుతోంది. అయితే ఈ మూవీ ప్రయాణం అనుకున్నంత సాఫీగా సాగలేదు. రాజకీయ సమీకరణాలు, పవన్ బిజీ షెడ్యూల్స్ వల్ల సినిమా షూటింగ్ ఏళ్ల తరబడి సాగడం.. మధ్యలో హరీష్ శంకర్ తీసిన 'మిస్టర్ బచ్చన్' ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఒక దశలో హైప్ తగ్గింది. అయితే, ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది.

 ప్యూర్ ఒరిజినల్ మేజిక్!

ఈ సినిమా విజయ్ నటించిన 'తేరి'కి రీమేక్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనివల్ల ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. కానీ, ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత రవిశంకర్ ఈ వార్తలను కొట్టిపారేశారు. పవర్ స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఇది పక్కా మాస్ అండ్ ఒరిజినల్ కథ అని క్లారిటీ ఇచ్చారు . దీంతో ఈ మూవీపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా తనదైన శైలిలో గర్జించబోతున్నారు.

'దేఖ్ లేంగే సాలా'.. రికార్డుల వేట !

చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్‌లో పాత ఫ్లోను, ఎనర్జీని చూపిస్తూ విడుదలైన 'దేఖ్ లేంగే సాలా' పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ మాస్ బీట్స్‌కు పవన్ వేసిన హుక్ స్టెప్స్ చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. 24 గంటల్లోనే ఈ పాట మిలియన్ల వ్యూస్ రాబట్టి, టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ పాటతో ఉస్తాద్‌కు కావాల్సినంత బజ్ వచ్చేసింది.

మార్చి 27న పవర్ స్టార్ స్ట్రైక్?

ప్రస్తుతం షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం, రామ్ చరణ్ 'పెద్ది' చిరంజీవి 'విశ్వంభర' వంటి పెద్ద సినిమాలు రేసులో వెనక్కి తగ్గడంతో, ఆ ఖాళీని భర్తీ చేయడానికి ఉస్తాద్ సిద్ధమవుతున్నాడు.  మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని మార్చి 27, 2026 న లేదా ఏప్రిల్ మూడవ వారంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం .  శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో పవన్ ఎనర్జీ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. 2026 సమ్మర్ బాక్సాఫీస్ వద్ద ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి రికార్డులు తిరగరాస్తాడో చూడాలి మరి.