ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం.. బీఆర్ఎస్‌ మాజీ ఎంపీ సంతోష్‌కు సిట్ నోటీసులు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం.. బీఆర్ఎస్‌ మాజీ ఎంపీ సంతోష్‌కు సిట్ నోటీసులు

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌ మాజీ ఎంపీ సంతోష్‌రావుకు విచారణకు హాజరు కావాలని సిట్‌ నోటీసులు జారీ చేసింది. మంగళవారం(జనవరి 27, 2026) మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సంతోష్‌రావుకు సిట్ నోటీసుల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, హరీష్‌రావును సిట్ విచారించిన సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నోళ్లను కట్టడి చేసేందుకు ఎస్‌‌‌‌ఐబీ కేంద్రంగా ప్రణీత్‌‌‌‌రావు ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్‌‌‌‌ టార్గెట్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ను ఏర్పాటు చేశారు.

బేగంపేటలోని ఎస్‌‌‌‌ఐబీ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఎస్‌‌‌‌వోటీ లాగర్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు సహా రాష్ట్రంలోని కీలక నాయకులు, మీడియా, సినీ ఇండస్ట్రీ ప్రముఖుల ఫోన్‌‌‌‌ నెంబర్లతో ప్రణీత్‌‌‌‌రావు టీమ్ ప్రత్యేక ప్రొఫైల్స్ రూపొందించింది. ఈ క్రమంలోనే  ఓ మహిళా జడ్జి, ఓ కోర్టు జడ్జి దంపతులు సహా పబ్లిక్‌‌‌‌ డొమైన్‌‌‌‌లో ఉన్న హైకోర్టు జడ్జీల వివరాలను సేకరించినట్లు సిట్‌‌‌‌ దర్యాప్తులో వెల్లడైంది.

16 మంది జడ్జీలకు సంబంధించిన ప్రొఫైల్స్‌‌‌‌ పెన్‌‌‌‌డ్రైవ్‌‌‌‌లో ఉన్నట్టు సమాచారం. మొత్తం 6 వేల మందికి పైగా ప్రొఫైల్స్‌‌‌‌ను ఎస్‌‌‌‌వోటీ టీమ్ తయారు చేసినట్టు తెలిసింది. దాదాపు 4,200కు పైగా ఫోన్‌‌‌‌ నెంబర్లతో ప్రొఫైళ్లను క్రియేట్‌‌‌‌ చేసినట్టు సిట్‌‌‌‌ గుర్తించింది. ప్రణీత్‌‌‌‌ రావు టీమ్‌‌‌‌ ధ్వంసం చేసిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌‌‌‌ హార్డ్‌‌‌‌ డిస్క్‌‌‌‌ల్లో మరో 2 వేలకు పైగా ఫోన్‌‌‌‌ నంబర్లు, వ్యక్తిగత సమాచారం ఉన్నట్టు ఆధారాలు సేకరించింది. అలాగే ప్రభాకర్ రావు సహా ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌తో సంబంధం ఉన్న అధికారులు, రాజకీయ పార్టీల నేతల కుట్రలకు సంబంధించిన కీలక ఆధారాలు పెన్‌‌‌‌డ్రైవ్‌‌‌‌లో ఉన్నట్టు తెలిసింది.