విభేదించడం కూడా దేశభక్తే అంటున్న నయన్

విభేదించడం  కూడా దేశభక్తే అంటున్న నయన్

హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పరిచయమై రెండు దశాబ్ధాలు దాటుతున్నా.. ఇప్పటికీ సూపర్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దూసుకెళుతోంది నయనతార.  ఓవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోలకు జంటగా నటిస్తోంది. ఆమె నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో   ఒకటి ‘పేట్రియాట్’. మలయాళ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో  నయనతార  ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. ఆదివారం ఈ చిత్రం నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. సీరియస్  లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంటెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  కనిపిస్తున్న  నయన్ ఆకట్టుకుంది.

 ‘విభేదించడం కూడా దేశభక్తే’ అని ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై క్యాప్షన్ ఇవ్వడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.  మహేష్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో  ఫహాద్ ఫాజిల్, రేవతి,  కుంచాకో బోబన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆంటో జోసెఫ్, కేజీ అనిల్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని   ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాన్ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నారు. సుషిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నాడు.