Varun Dhawan: ముంబై మెట్రోలో వరుణ్ ధావన్ విన్యాసాలు.. స్టంట్‌‌లు చేస్తే శిక్షకు అర్హులంటూ అధికారులు ఫైర్

Varun Dhawan: ముంబై మెట్రోలో వరుణ్ ధావన్ విన్యాసాలు.. స్టంట్‌‌లు చేస్తే శిక్షకు అర్హులంటూ అధికారులు ఫైర్

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఊహించని చిక్కులో పడ్డాడు. ఇటీవలే ముంబై మెట్రోలో ప్రయాణించిన వరుణ్ తన అత్యుత్సాహంతో విమర్శలు మూటకట్టుకుంటున్నాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు మెట్రోలో ఈ బాలీవుడ్ హీరో స్టంట్‌ లు చేస్తూ చర్చనీయాంశంగా మారాడు. మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు పుల్ అప్స్ చేస్తూ కనిపించాడు. వరుణ్ ను చూసిన వ్యక్తి కూడా మెట్రోలో అలాగే చేస్తూ కనిపించాడు. ఆ వ్యక్తిని ఈ బాలీవుడ్ స్టార్ ఎంకరేజ్ చేయడం తీవ్ర విమర్శలకు గురి చేస్తోంది. తాను చేసిందే కాక తన ఎదురుగా ఉన్న వ్యక్తిని ఎలా చేయాలో వివరణ ఇస్తూ కనిపించాడు. 

మహా ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMMOCL) ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో వరుణ్ ధావన్ ఓవర్ హెడ్ గ్రాబ్ హ్యాండిల్స్ సహాయంతో పుల్-అప్‌లు చేస్తున్న వీడియో పోస్ట్ చేయబడింది. ఈ వీడియో క్లిప్ కింద ఇలా రాసి ఉంది " ఇలాంటి వీడియో స్టంట్‌ లు మీ యాక్షన్ సినిమాల్లో పనికొస్తాయి. దయచేసి మెట్రోలో ఇలాంటివి ప్రయత్నించవద్దు. మెట్రోలో స్నేహితులతో ప్రయాణించడం బాగుంటుంది. కానీ గ్రాబ్ హ్యాండిల్స్ ఉంది పట్టుకొని వేలాడడానికి కాదు. మహా ముంబై మెట్రోలో బాధ్యతాయుతంగా ప్రయాణించండి."అని పోస్ట్ చేయబడి ఉంది. వరుణ్ ధావన్ చేసిన పనికి సోషల్ మీడియాలో నెటిజన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. 

స్టార్ హీరో ఇలాటివి ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదని చెబుతున్నారు. మెట్రో రైల్వేస్ (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) చట్టం ప్రకారం 2002 ప్రకారం మెట్రోలో ఆస్తులకు భంగం కలిగిస్తే సెక్షన్ల కింద ఇలాంటి చర్యలు శిక్షార్హమైనవి. నేరం తీవ్రతను బట్టి జరిమానాలు.. జైలు శిక్ష కూడా విధించబడతాయి. ఇదిలా ఉంటే వరుణ్ ధావన్ ఇటీవలే నటించిన బోర్డర్ 2 సినిమాలో అతని నటనపై తీవ్రంగా ట్రోల్స్ వచ్చాయి. 'బోర్డర్ 2' సినిమాలో వరుణ్ ధావన్ సినిమాలో సరిగ్గా సరిపోలేదని నెటిజన్లు పేర్కొన్నారు. అయితే ఆ సినిమాలోని నటులు, చిత్రనిర్మాతలు వరుణ్‌కు మద్దతుగా నిలిచారు.