రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రొటోకాల్ వివాదం.. రాహుల్ కు మూడో వరుసలో సీటు కేటాయింపు.. కాంగ్రెస్వర్గాల ఆగ్రహం

రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రొటోకాల్ వివాదం.. రాహుల్ కు మూడో వరుసలో సీటు కేటాయింపు.. కాంగ్రెస్వర్గాల ఆగ్రహం

77వ రిపబ్లిక్​ డే వేడుకల్లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్​ఎంపీ  రాహుల్​గాంధీకి సీటు కేటాయింపుపై మరోసారి వివాదం తలెత్తింది. ప్రోటోకాల్​ మరిచి ప్రతిపక్షనేతకు మూడో వరుసలో సీటు కేటాయించారని కాంగ్రెస్​ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తికి చిన్న పిల్లల మధ్య సీటు కేటాయించడం ప్రోటోకాల్​ వివాదమే కాదు.. భద్రతకు సంబంధించిన నిర్లక్ష్యమని  సోషల్​ మీడియాలో కాంగ్రెస్​ నేతలు  ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశం ఎప్పటికీ మర్చిపోదు.. ఎప్పటికీ క్షమించదు అంటూ ట్వీట్లు చేశాయి కాంగ్రెస్​ వర్గాలు. 

రాహుల్​గాంధీకి ప్రోటోకాల్  ఉల్లంఘన ద్వారా అవమానం కొత్తేమికాదు.. గత 2024 స్వాతంత్రవేడుకల్లో కూడా  సీటు కేటాయింపులో ప్రొటోకాల్​ఉల్లంఘించారని కాంగ్రెస్​ మండిపడుతోంది. అప్పడు రెండో వరుస చివర్లో సీటు కేటాయించారు.. ఇప్పుడు మూడో వరుసలో పిల్లల మధ్య సీటు ఇవ్వడంతో కాంగ్రెస్​ వర్గాలు భగ్గుమన్నాయి. ప్రొటోకాల్​ ఉల్లంఘనే కాదు భద్రతకు సంబంధించిన నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తే సోషల్​ మీడియా ప్లాట్​ ఫాంలో పోస్టులు షేర్​ చేశారు. 

►ALSO READ | ఫేక్ వెహికల్ పాస్ వాడినందుకు..కచ్చా బాదం ఫేమ్ అంజలి అరోరా ప్రియుడు అరెస్టు

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను  సోమవారం (జనవరి26) దేశమంతా పండుగలా జరుపుకుంది. పిల్లలు, పెద్దలు అంతా ఎంతో ఉత్సాహంగా రిపబ్లిక్​ డే వేడుకలు జరుపుకున్నారు. దేశ రాజధానిఢిల్లీలో  ఘనంగా రిపబ్లిక్ వేడుకలు జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్​ లో ఈ వేడుకలు నిర్వహించారు. ఆర్మీ, నావికాదళం, వైమానికదళం, సాంస్కృతిక శకటాలు,  వివిధ ప్రదర్శనలతో కూడి గ్రాండ్​ కవాతుతో వేడుకలు విజయవంతంగాజరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని మోదీ, ప్రతిపక్ష పార్టీ నేతలు పాల్గొన్నారు.