కిక్కిరిసిన చెర్వుగట్టు..స్వామివారి కళ్యాణానికి భారీగా తరలివచ్చిన భక్తులు

కిక్కిరిసిన చెర్వుగట్టు..స్వామివారి కళ్యాణానికి భారీగా తరలివచ్చిన భక్తులు

నల్లగొండ జిల్లాలో ప్రసిద్ద శైవ క్షేత్రం చెర్వుగట్టు రామలింగేళ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. వడిబియ్యం సమర్పించి గర్భగుడిలో స్వామివారిని దర్శికున్నారు. 

నల్లగొండ జిల్లా  నార్కట్​ పల్లి మండలంలోని ప్రసిద్ద చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. వార్షిక బ్రహ్మోత్సవాలు, రథసప్తమి వేళ స్వామి వారి కళ్యాణోత్సవం, అగ్నిగుండాల కార్యక్రమాలకోసం భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిపోయాయి. భక్తులు పవిత్ర పుష్కరణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. 

►ALSO READ | కూకట్పల్లి వివేకానంద నగర్లో విషాద ఘటన.. తండ్రితో కలిసి బైక్పై వెళుతుండగా..

బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలక ఘట్టమైన శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది జాతరకు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు అన్న ప్రసాద వితరణ, మౌలిక వసతులపై ప్రత్యేక నిఘా పెట్టారు.

ఆలయ ప్రధాన అర్చకులు రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో కల్యాణ ఘట్టం అంగరంగ వైభవంగా సాగింది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం తలంబ్రాల తంతు ఆ తర్వాత కల్యాణ ఘట్టం ముగిసింది. స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు యావత్ తెలంగాణ నుంచి పోటెత్తారు. పార్వతీరామలింగేశ్వర స్వామి జంటకు తలంబ్రాలు సమర్పించేందుకు భారీగా క్యూకట్టారు. ఆనవాయితీ ప్రకారం..పార్వతీపరమేశ్వరులకు తలంబ్రాలు సమర్పించి భక్తులు  తమ మొక్కలు తీర్చుకున్నారు.