T20 World Cup 2026: పాకిస్థాన్ వరల్డ్ కప్ ఆడుతుందో లేదో ఆ రోజే తెలుస్తుంది: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్

T20 World Cup 2026: పాకిస్థాన్ వరల్డ్ కప్ ఆడుతుందో లేదో ఆ రోజే తెలుస్తుంది: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్

2026 టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్​ వైదొలిగిన తరువాత ఇప్పుడు దాయాధి దేశం పాకిస్థాన్ అదే రూట్ లో వెళ్లనున్నట్టు సమాచారం. భద్రతా పరమైన కారణాలతో ఇండియాలో పర్యటించలేమంటూ బంగ్లాదేశ్ జట్టు టోర్నీని బహిష్కరించింది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ బాటలోనే నడవనుందని.. దాయాది దేశం కూడా టీ20 టోర్నీని బహిష్కరించే యోచనలో ఉన్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. 
తమ మిత్ర దేశం బంగ్లాదేశ్‎కు మద్దతుగా పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటుందట. భారత్, శ్రీలంక సంయుక్తంగా అతిథ్యమివ్వనున్న టీ20 వరల్డ్ కప్‎ ఆడాలా..? బాయ్ కాట్ చేయాలా అనే అంశంపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యోచిస్తోందట.

ఈ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ మీడియాతో మాట్లాడుతూ.. తమ జట్టు టీ20 వరల్డ్ కప్‎లో పాల్గొనాలా వద్దా అనేది పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ద్వారా నిర్దేశించబడుతుందని స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కొన్ని రోజుల క్రితం నఖ్వీ పేర్కొన్నారు. పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారని.. ఆయన తిరిగిచ్చాక ఈ అంశంపై డిస్కస్ చేస్తామని తెలిపారు. లేటెస్ట్ సమాచార ప్రకారం పాకిస్థాన్ వరల్డ్ కప్ ఆడుతుందో లేదో మరికొన్ని రోజుల్లో తెలియనుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ఎక్స్ లో ట్వీట్ చేశారు.   

పాకిస్థాన్ వరల్డ్ కప్ వరల్డ్ కప్ ఆడుతుందో లేదో అనే విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. "ప్రధాని మియాన్ ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ తో సమావేశం జరిగింది. ఐసీసీ గురించి పూర్తిగా వివరించాను. బాయ్ కాట్ ఆలోచన ఇంకా మా పరీశీలనలో ఉంది. శుక్రవారం లేదా వచ్చే సోమవారం తుది నిర్ణయం తీసుకుంటాము". అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ ట్వీట్ చేశారు.తమ నిర్ణయం పూర్తిగా ప్రభుత్వంపైన ఆధారపడి ఉంటుందని.. ఐసీసీపై కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నఖ్వీ వ్యాఖ్యలతో మెగా టోర్నీలో పాకిస్తాన్ పార్టిసిపేషన్‎పై సందిగ్ధం నెలకొంది.