
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. శనివారం ఔట్ పేషెంట్ బ్లాకులో ఓ మహిళ దాదాపు 6 నెలల వయసున్న ఆడ పసికందును అక్కడున్న ఓ జంటకిచ్చి ఇప్పుడే వస్తానని వెళ్లిపోయింది. గంటల సమయం గడిచినా.. ఇంకా సదరు మహిళ తిరిగి రాకపోవడంతో ఆ జంట గాంధీ సిబ్బందికి పాపను అప్పజెప్పి వెళ్లిపోయారు. పసికందు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సిబ్బంది ఎంసీహెచ్భవనంలోని పీడియాట్రిక్ వార్డులో అడ్మిట్ చేశారు. చిన్నారికి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారు.