IPL 2026 సీజన్లో SRH, RR టీమ్స్ మధ్య ఎలిమినేటర్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో ఏ జట్టు ఓడితే ఆ జట్టు ఇంటి బాట పట్టక తప్పదు. అందువల్ల.. క్వాలిఫయర్-1 మ్యాచ్ కంటే ఎలిమినేటర్ మ్యాచ్ పైనే అభిమానుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది. ఈ మ్యాచ్పై అభిమానుల అంచనాలు ఎలా ఉన్నా.. జ్యోతిష్యులు కూడా ఈ మ్యాచ్పై విశ్లేషణ చేస్తున్నారు.
కుజ, బృహస్పతి, చంద్ర గ్రహాల అమరిక వల్ల.. ఇరు జట్ల మధ్య జరిగే ఈ పోరు వన్ సైడ్ మ్యాచ్ అయితే కాదని.. ఈ గ్రహాల బలమైన అమరిక వల్ల.. SRH, RR మ్యాచ్ పోటాపోటీగా.. నువ్వానేనా అనే రీతిలోనే సాగుతుందని జ్యోతిష్యులు అంచనా వేశారు.
ఇక.. పవర్ ప్లే విషయానికొస్తే.. రాజస్తాన్ రాయల్స్ జట్టుకు పవర్ ప్లే బాగా అనుకూలిస్తుందని చెప్పుకొచ్చారు. అటాకింగ్ బ్యాటింగ్తో పవర్ ప్లేలోనే భారీ స్కోర్ చేసే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. ఇక.. మిడిల్ ఓవర్లు మాత్రం SRHకు అనుకూలంగా ఉంటాయని.. SRH బౌన్స్ బ్యాక్ అవుతుందని.. మెరుగ్గా పుంజుకుంటుందని చెప్పారు. డెత్ ఓవర్లలో గురు, చంద్రుల స్థానాల వల్ల 16 నుంచి 20 ఓవర్ల మధ్య మ్యాచ్ ఊహించని మలుపు తిరుగుతుంది. టాస్ ఎవరు గెలిచినా డెత్ ఓవర్లలో మాత్రం మ్యాచ్ మజాగా ఉంటుందని జ్యోతిష్యులు చెప్పుకొచ్చారు.
ఇవాల్టి గ్రహస్థితులపై SRH అంచనా ఏంటీ..?
మ్యాచ్ జరిగే మే 27వ తేదీన ఉన్న గ్రహాలు సన్ రైజర్స్ హైదరాబాద్ SRH బ్యాటింగ్ పై బలమైన శక్తిని ఇస్తాయి. సూర్యుడు మిధున రాశిలో ఉండటంతో SRH దూకుడుగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వేగంగా ఆలోచించే తీరు SRH జట్టుకు అనుకూలంగా ఉండొచ్చు. ప్రస్తుతం SRH దూకుడుకు గ్రహాల అనుకూల స్థితి సరిగ్గా సరిపోతుందని జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు.
ఇవాల్టి గ్రహస్థితుల ఆధారంగా రాజస్తాన్ రాయల్స్ జట్టును పరిశీలిస్తే.. కర్కాటక రాశిలో గురు గ్రహం ఉంది. ఇది జట్టు రక్షణ శక్తికి సంబంధించి శక్తిని ఇస్తుంది. స్థిరత్వానికి అవకాశం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ లో స్థిరంగా, నిలకడగా ఉన్నట్లయితే RR విజయావశాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది.ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
