
SRH vs RCB: లక్నో వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ ఇషాన్ కిషన్ రెచ్చిపోయి పరుగుల వరద పారించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముందు 232 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కేవలం 48 బంతుల్లో 94 నాటౌట్ అజేయంగా నిలిచాడు. ధనాధన్ షాట్లతో ఆకట్టుకున్న ఇషాన్.. కొద్దిలో సెంచరీ మిస్ అయ్యింది. శుక్రవారం (మే23) లక్నో స్టేడియంలో ఆర్సిబీతో జరిగిన మ్యాచ్ లో ఇషాన్ చెలరేగడంతో SRH 20 ఓవర్లలో 6వికెట్లకు 231 పరుగులు చేసింది.
Ishan Kishan packs a punch with 94*(48) 🔥
— IndianPremierLeague (@IPL) May 23, 2025
🎥🔽 WATCH his superb knock | #TATAIPL | #RCBvSRH | @ishankishan51
SRH బ్యాటర్లలో ఇషాన్ కిషన్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో కిషన్ 94 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అభిషేక్ శర్మ(34), క్లాసెన్(24), హెడ్(17), అనికేత్ వర్మ(26) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో రొమారియో షెపర్డ్ రెండు వికెట్లు పడగొట్టగా.. సుయాష్, ఎంగిడీ,భువనేశ్వర్, పాండ్యా తలా వికెట్ సాధించారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ,(వికెట్ కీపర్ , కెప్టెన్) టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండే, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, లుంగి ఎండిగి, సుయాశ్ శర్మ్
సన్ రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్) నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్) హర్మల్ పటేల్, జయదేశ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ.
Innings break!
— IndianPremierLeague (@IPL) May 23, 2025
Ishan Kishan's magnificent leading act of 9⃣4⃣* to go along with useful cameos power #SRH to 231/6 🔥
Will #RCB chase down the BIG 🎯 ?
Updates ▶ https://t.co/sJ6dOP9ung#TATAIPL | #RCBvSRH | @SunRisers pic.twitter.com/F5obBrbQRA