Avatar3 Trailer Review: అగ్నితో ఆట, రెండు తెగల యుద్ధం.. అద్భుత విజువల్స్‌తో అవతార్ 3 ట్రైలర్

Avatar3 Trailer Review: అగ్నితో ఆట, రెండు తెగల యుద్ధం.. అద్భుత విజువల్స్‌తో అవతార్ 3 ట్రైలర్

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్  ఆవిష్కరించిన అద్భుత దృశ్య కావ్యం ‘అవతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్‌‌‌‌‌‌‌‌ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. విజువల్‌‌‌‌‌‌‌‌ వండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వచ్చిన ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు భాగాలు సూపర్ సక్సెస్ సాధించాయి.  డిసెంబర్ 19న ఈ మూవీ మూడో భాగం  ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసిన మేకర్స్‌‌‌‌‌‌‌‌... గురువారం కొత్త ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. మొదటి భాగాన్ని పండోర గ్రహంలోని ప్రకృతి అందాల మధ్య చూపించిన కామెరూన్.. ‘అవతార్: ది వే ఆఫ్‌‌‌‌‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ పేరుతో రెండో భాగాన్ని నీటి మధ్య తెరకెక్కించాడు.

ఇప్పుడు మూడో భాగం అగ్ని నేపథ్యంలో రాబోతోంది. అద్భుతమైన విజువల్స్‌‌‌‌‌‌‌‌తో కట్ చేసిన ఈ కొత్త ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. బలమైన ఎమోషన్స్, డ్రామా, అడ్వెంచర్, యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో అవతార్ 3 ప్రేక్షకులను ఆశ్చర్యపరచనుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. అగ్ని, నీళ్లలో వచ్చే సీక్వెన్స్, రెండు తెగల మధ్య జరిగే యుద్ధం.. ట్రైలర్లో హైలెట్‌గా నిలిచాయి. ఇందులో ఆ గ్రహం మీద మానవ పాత్ర ఎలాంటి మాస్క్ లేకుండా గాలి పీల్చుకోవడం మరింత అంచనాలు పెంచింది.

ఇదిలా ఉంటే ఈలోపు సెకండ్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ను  ఇండియాలో  రీ రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. అక్టోబర్ 2 నుంచి ఒక వారం రోజులపాటు ఈ చిత్రాన్ని త్రీడీ వెర్షన్‌‌‌‌‌‌‌‌లో విడుదల చేస్తున్నారు. ఇక 2029లో ‘అవతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4’, 2031లో ‘అవతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5’ విడుదల కానున్నాయి.