జనగామ, వెలుగు : రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వడ్ల కొనుగోళ్లు స్పీడప్ చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలంలోని చీటూరు, కుందారంలోని ఐకేపీ సెంటర్లను సందర్శించారు. కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించి, రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లారీల్లో బస్తాలను లోడింగ్ చేసి మిల్లుల్లో అన్లోడింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
