త్వరలో జాతిరత్నాలు స్టాండప్ కామెడీ షో

త్వరలో జాతిరత్నాలు స్టాండప్ కామెడీ షో

సినిమాల్లోనే కాదు టీవీల్లోనూ స్టాండప్​ కామెడీ షోలు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. తెలుగు ఆడియెన్స్​ని కడుపుబ్బా నవ్వించేందుకు త్వరలోనే కొత్త  స్టాండప్ కామెడీ షో రాబోతోంది. ఈ షో పేరు ‘జాతిరత్నాలు’. దీనికి శ్రీముఖి హోస్ట్. ఈమధ్యే ఈ షో టీజర్ వచ్చింది. అందులో శ్రీముఖి ‘రాను అనుకున్నారా? రాలేననుకున్నారా? రాముల ఈజ్​ బ్యాక్. ఇదొక కొత్త రకం కామెడీ షో. నవ్వడానికి రెడీగా ఉండండి’ అంటూ చెప్పిన డైలాగ్స్ ఆడియెన్స్​ని ​ఎంటర్​టైన్​ చేశాయి. దాదాపు 60 మంది స్టాండప్ కమెడియన్స్ తమ స్టైల్ కామెడీతో ఎంటర్​టైన్ చేయనున్నారు. ఈ షో త్వరలోనే ఈటీవీ ప్లస్​లో ఏప్రిల్ 4 నుంచి టెలికాస్ట్ అవుతుందని టాక్.