సూర్యాపేట, వెలుగు: ఎస్ఎస్సీ ఫలితాల్లో జయ పాఠశాల విద్యార్థులు జయ కేతనం ఎగరవేశారు. దాసరి రిత్విక 596 మార్కులతో స్టేట్ 2వ ర్యాంకు సాధించగా.. మొత్తం 11 మంది విద్యార్థులు 590 పైగా మార్కులు సాధించినట్టు కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ తెలిపారు. అలాగే.. 61 మంది 580 మార్కులకు పైగా, 143 మంది 570కి పైగా, 238 మంది 560కి పైగా, 330 మంది 550 కి పైగా, 586 మంది 500 కు పైగా మార్కులు సాధించారు.
వీరితోపాటు బోడ ప్రసన్న (595), కట్ట దేవి ప్రియ (594), పోతుగంటి శ్రీశ్వాస (594), బుడిగ సాన్విక (593), తిప్పన శ్రీజ రెడ్డి (593), కై రోజు హేమంత్ సాయి (592), బూరెడ్డి హర్షిత (591), కక్కిరేణి ప్రజ్వల (591), నిమ్మల వైశాలి (591), తోవిటి సహస్ర (591) మార్కులు సాధించారని తెలిపారు.

