నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : ఆగస్టు 21న వికారాబాద్లో జాబ్ మేళా.. హైదరాబాద్ లోనే కొలువులు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : ఆగస్టు 21న  వికారాబాద్లో జాబ్ మేళా.. హైదరాబాద్ లోనే కొలువులు

వికారాబాద్, వెలుగు: అపోలో హోమ్ హెల్త్ కేర్ ప్రైవేట్ ​లిమిటెడ్ లో హోమ్ కేర్ నర్సెస్, హోమ్ కేర్ నర్సింగ్ అసిస్టెంట్స్, పేషెంట్ కేర్ అసిస్టెంట్స్ ఉద్యోగాల కోసం ఈ నెల 21న ఉదయం 10:30 గంటలకు జాబ్​మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి షేక్ అబ్దుస్ సుభాన్ తెలిపారు. ఐటీఐ క్యాంపస్​ఆవరణలోని ఎంప్లాయ్​మెంట్ ఆఫీసులో మేళా ఉంటుందన్నారు. 50కు పైగా పోస్టులు ఉన్నాయని,18 ఏండ్ల నుంచి 40 ఏండ్ల లోపు ఉండాలన్నారు. 

జీడీఏ,ఎంపీహెచ్​డబ్ల్యూ, ఏఎన్​ఎం, జీఎన్ఎం, బీఎస్​సీ నర్సింగ్, పోస్ట్​ బీఎస్​సీ నర్సింగ్, ఎంఎస్​సీ నర్సింగ్ చదివిన వారు అర్హులన్నారు. పోస్టును బట్టి నెలకు రూ.10వేల నుంచి రూ.40 వేల జీతం ఉంటుందన్నారు. ఈ జాబ్స్​అన్నీ హైదరాబాద్ లో ఉన్నాయని, వివరాలకు 9676047444 నంబర్​లో  సంప్రదించాలన్నారు.