పీఆర్ ఇంజినీరింగ్ ఇన్చీఫ్గా జోగారెడ్డి

పీఆర్ ఇంజినీరింగ్ ఇన్చీఫ్గా జోగారెడ్డి
  • మంత్రి సీతక్కను కలిసిన ఈఎన్సీ 

హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్ జోగారెడ్డి నియమితులయ్యారు. మంగళవారం ఎర్ర మంజిల్ లోని ఈఎన్సీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ప్రజాభవన్ లో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జోగారెడ్డిని మంత్రి సీతక్క  అభినందించారు. ప్రజా ప్రభుత్వం పంచాయతీరాజ్ విభాగంలో నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని మంత్రి సూచించారు.

 గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని ఆకాంక్షించారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన  జోగారెడ్డి పీఆర్​ ఇంజినీరింగ్​ విభాగంలో 1989 లో ఏఈగా విధుల్లో చేరారు. అంచెలంచెలుగా ఇంజినీర్ ​ఇన్​చీఫ్ స్థాయికి ఎదిగారు.