ఆధ్యాత్మికం: ధనుర్మాస పూజ .. వెయ్యేళ్ల ఫలం... దైవ ప్రార్థనకు అనుకూల మాసం ఇదే..!

ఆధ్యాత్మికం: ధనుర్మాస పూజ  .. వెయ్యేళ్ల ఫలం... దైవ ప్రార్థనకు అనుకూల మాసం ఇదే..!

వైష్ణవాలయాల్లో ధనుర్మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు... ఆచరిస్తారు.... పూజిస్తారు. దేవదేవుడు కొలువైన తిరుమలేశుని ఆలయంలో ఈ మాసాన్ని వైఖానసాగమోక్తంగా నిర్వహించటం సంప్రదాయం. ఈ మాసంలో స్వామివారికి ప్రత్యేక నిత్య కైంకర్యాలు, ప్రత్యేక నివేదనలు సమర్పించటం వైష్ణవ సంప్రదాయం. నియమ నిష్టలు, భక్తి శ్రద్ధలతో శ్రీవేంకటేశ్వరస్వామిని పూజిస్తే కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ నెలంతా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయటానికి భక్తులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.

సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడంతో ధనుర్మా సం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే సంక్రాంతి పర్వదినంతో  (2026 జనవరి 14) ధనుర్మాసం ముగిసిపోతుంది. ఈ మాసంలో వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు, నివేదనలు చేయటం సంప్రదాయంగా వస్తోంది.

ఆండాళ్​ తిరుప్పావై పారాయణం

12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్ (గోదాదేవి) ఒకరు. ఈమెను నాబియార్ అని కూడా పిలు స్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ అండాళ్​  రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున జీయంగార్లు నివేదిస్తారు. పురాణాల ప్రకారం గోదాదేవి తనను ద్వాపర యుగంలోని గోపికగా భావించి ఆవిష్కరించిన 30 పాశురాలను పఠిస్తారు..

మూగతోమాల సేవ

 ధనుర్మాస పూజలకోసం తిరుమల శ్రీవారి ఆలయం సిద్ద మైంది. తిరుమలేశునికి అనునిత్యం వేకువజాము 3 గంటలకు నిర్వహించే సుప్రభాత సేవ బదులు జీయంగార్లు, వారి ప్రతినిధులు తిరుప్పా వై పఠిస్తారు.సాధారణ రోజుల్లో తోమాల సేవ జరిగే సమయంలో జీయర్ స్వాములు గోష్ఠి నిర్వహిస్తా రు. ఈ మాసంలో నిశ్శబ్దంగా ప్రత్యేకంగా  తోమాల సేవ చేస్తారు. దీనినే 'మూగ తోమాల' అని పిలుస్తారు.

 బిల్వదళాలతో సహస్రనామార్చన తిరుమలలో శ్రీవారికి తోమాల సేవ అయిన వెంటనే మొదటి అర్చనగా వేయి నామాలతో సహస్రనామార్చన నిర్వహిస్తారు. సాధారణ రోజుల్లో ఈ అర్చనలో తులసి దళాలు సమర్పిస్తారు. ధనుర్మాసంలో మాత్రం మారేడు (బిల్వం) దళాలతో అర్చక స్వాములు గర్భాలయ మూలమూర్తి పాద పద్మా లతో అర్చిస్తారు. బిల్వపత్రాలంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం. అందుకే ధనుర్మాసంలో ఈ బిల్వ పత్రాల తోనే స్వామివారిని అర్చిస్తారు. వైఖానస భృగు సంహిత ప్రకారం శ్రీ మహావిష్ణువును ఎనిమిది రకాల పుష్పాలతో అర్చిస్తారు. వీటిలో నందివర్ణ నం, పద్మం, తులసి, విష్ణుపామిక, బిల్వం, గన్నేరు, కుముదం,  మెట్ట తామర ఉన్నాయి.

మూడు చిలుకలతో అలంకరణ

శ్రీవారికి ధనుర్మాసం ఆరాధనలో భాగంగా మూడు చిలుకలతో అలంకరిస్తారు. సాధారణ రోజుల్లో శ్రీవారికి నిర్వహించే తోమాల సేవలో ఎలాంటి పుష్పాలంకరణ ఉండదు. ధనుర్మాసంలో మూలవిరాట్టును పూలమాలలతో అలంకరిస్తారు. అదే విధంగా మూడు చిలకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీటిలో రెండు చిలకలు, ఆకులు, మరొకటి వజ్రాలు పొదిగిన బంగారు చిలుక. ఒక ఆకు చిలుకను శ్రీవిల్లి పుత్తూరులోని ఆండాళ్​ అమ్మవారి సన్నిధిలోని తయారు చేస్తారు. వీటిని ఎడమ వైపున శ్రీవారి ఎదపై అలంకరిస్తారు. మరొక ఆకు చిలుకను టీటీడీ ఉద్యానవన విభాగం రూపొందిస్తుంది. దీన్ని ఎడమ వైపు శంఖువు వద్ద అలంకరిస్తారు. బంగారు చిలుక  ధనుర్మాసంలో కుడి వైపున ఎదపై దర్శనమిస్తుంది.

శ్రీకృష్ణస్వామికి ఏకాంత సేవ

ధనుర్మాసంలో తెల్లవారుజామున శీతాకాలం చలిలో వేడివేడి పొంగలి పాయసాలతోపాటు శ్రీ నివాసుడికి బెల్లపు దోసె ప్రత్యేకంగా నివేదిస్తారు. అదేవిధంగా ముద్గాన్నం, సుండల్, సీరా సమర్శి స్తారు.

సాధారణంగా తిరుమల ఆలయంలో అర్ధరాత్రి వేళ మూలమూర్తి ముందున్న కులశేఖరపడి తర్వాత మండపంలో భోగ శ్రీనివాస మూర్తికే నిత్యం ఏకాంత సేవ నిర్వహించటం సంప్రదాయం. వైఖానస ఆగమం ప్రకారం దీన్ని శయవాసన పవళింపు సేవ అని కూడా పిలుస్తారు. అయితే, ఈ ధనుర్మానంలో మాత్రం భోగ శ్రీనివాస మూర్తికి బదులుగా ఆలయంలోని శ్రీకృష్ణ స్వామికి నిర్వహించటం కూడా సంప్రదాయమే.

ఆలయ వీధుల్లో జీయర్ల నిత్య గోష్ఠి

ధనుర్మాసంలో తిరుమలలోని పెద్ద జీయర్, చిన్న జీయర్ నేతృత్వంలోని పండితులు గోష్టి నిర్వహిస్తా రు. వేకువజాము ఆలయంలో తిరుప్పావై పఠనం తర్వాత జీయర్ల బృందం శిష్యపరివారంతో కలసి నిత్యం. నాలుగు మాడ వీదుల్లో గోష్టి నిర్వహిస్తారు.

ధునుర్మాసానికి విశేష ప్రాధాన్యం 

భక్తుల్లో ఎవరి విశ్వాసం వారిదే..  వివాహం కానివారు ఈ ధనుర్మానంలో తిరుమల ఆలయంలో శ్రీవారి కల్యాణంలో పాల్గొని స్వా మివారిని మనసారా ప్రార్థించి అక్షింతలు తలపై చల్లుకుంటే వివాహం అవుతుండని, భక్తుల విశ్వాసం. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్ధిస్తారు. కావున ఈ మాసానికి సౌ రమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

దైవ ప్రార్థనకు అనుకూలం

తాను అన్ని మాసాల్లో ఉత్తమమైన మార్గశిర మానం లాంటివాడినని శ్రీమహావిష్ణువు స్వయంగా చెప్పినట్లు పురాణాల ద్వారా తెలు స్తోంది. ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర కార్యక్రమాలు సాధారణంగా చేయరు. పూర్తిగా దైవంపైనే శ్రద్ధ వహించి ప్రార్థించాలన్నదే.ఇందులో అంతరార్థం.

ధనుర్మాస వ్రతం

శ్రీ గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి చూపారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖసంతోషాలు ఒనగూరుతాయని తెలియజేశారు. సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించేంవరకు  మధ్యగల కాలాన్ని ధనుర్మాసం అంటారు. పాపకర్మలను నశింపచేసి మోక్షసాధనకోసం చేసే ప్రతాలు, పూజలు, ఇతర ధార్మిక కార్యక్రమాలకు వీ
ఈ మాసం అనువైనదిగా భావిస్తారు.

ధనుర్మాస పూజ వెయ్యేళ్ల ఫలం

కలియుగంలో శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వరుని ధనుర్మాసంలో ఒకరోజు పూజించినా వెయ్యేళ్ల పూజాఫలం దక్కుతుంది. పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ భక్తులు ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో ధనుర్మాసపూజలు చేస్తారు.

వైకుంఠ ఏకాదశి

ఈ ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలను తెరచీ ఉంచుతారు. ఈ రెండు పర్వదినాలలో పరమ పవిత్రమైన వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు.