ప్రత్యేక లోక్‌‌‌‌‌‌‌‌ అదాలత్‌‌‌‌‌‌‌‌ను విజయవంతం చేయండి : జస్టిస్‌‌‌‌‌‌‌‌ కె. లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌

ప్రత్యేక లోక్‌‌‌‌‌‌‌‌ అదాలత్‌‌‌‌‌‌‌‌ను విజయవంతం చేయండి : జస్టిస్‌‌‌‌‌‌‌‌ కె. లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌
  •  అధికారుల సమావేశంలో జస్టిస్‌‌‌‌‌‌‌‌ కె. లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 15న నిర్వహించనున్న ప్రత్యేక లోక్‌‌‌‌‌‌‌‌ అదాలత్‌‌‌‌‌‌‌‌ను విజయవంతం చేయాలని హైకోర్టు లీగల్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ విజ్ఞప్తి చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌‌‌‌‌ అపరేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక లోక్‌‌‌‌‌‌‌‌ అదాలత్‌‌‌‌‌‌‌‌పై రెవెన్యూ అధికారులు, బీమా కంపెనీలు, ఆర్టీసీ, సింగరేణి కాలరీస్‌‌‌‌‌‌‌‌ అధికారులతో జస్టిస్‌‌‌‌‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ సోమవారం సమావేశం నిర్వహించారు. 

ఆర్టీసీ, బీమా కంపెనీలకు చెందిన వివాదాల్లో సుమారు 9 వేల దాకా కేసులు హైకోర్టులో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయన్నారు. అదేవిధంగా సింగరేణి కాలరీస్, ఏపీఎస్, టీజీ ఆర్టీసీకి చెందిన సర్వీసు, నాన్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ కేసుల్లో 4,458 కేసులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని, వీటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర లీగల్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ అథారిటీ మెంబర్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ సీహెచ్‌‌‌‌‌‌‌‌ పంచాక్షరి, హైకోర్టు లీగల్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ కమిటీ సెక్రటరీ ఎం.శాంతివర్ధని, టీజీ ఆర్టీసీ వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్, ఎండీ వై.నాగిరెడ్డి, సీసీఎల్‌‌‌‌‌‌‌‌ఏ కార్యదర్శి మకరంద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.