ట్రైలర్​కే కల్వకుంట్ల ఫ్యామిలీ వణుకుతున్నది : కిషన్​ రెడ్డి

ట్రైలర్​కే కల్వకుంట్ల ఫ్యామిలీ వణుకుతున్నది : కిషన్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్​ తెలంగాణకు కుటుంబ పెద్దే అయితే.. దళితులను సీఎం చేస్తానని చేయకుండా ఎందుకు దగా చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి ప్రశ్నించారు. పోడు భూములకు పట్టాలిస్తానని చెప్పి ఇవ్వకపోగా అడవి బిడ్డలపై కేసులు ఎందుకు పెట్టిస్తున్నారని ప్రశ్నించారు. ఆదివారం ఆయన కేటీఆర్​ వ్యాఖ్యలకు కౌంటర్​గా ట్వీట్​ చేశారు.

‘‘సాకులు చూపి నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగులను ఎందుకు వంచించారు? ఫుడ్​ పాయిజన్​ అయ్యి స్టూడెంట్స్​ ఆస్పత్రి పాలవుతుంటే మంచి ఫుడ్​ ఎందుకు పెట్టించట్లేదు? ఆడ బిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ఎందుకు స్పందించరు? మోదీ సభకు వచ్చిన ప్రజా స్పందన చూసి కల్వకుంట్ల కుటుంబం ఆగమాగం అవుతున్నది. చిన్న ట్రైలర్​కే గజగజ వణికిపోతుం టే.. రేపు సినిమా రిలీజైతే మీ పరిస్థితేంటో’’ అని పేర్కొన్నారు.