కన్నడ దర్శకుడితో దేవగన్‌‌‌‌

కన్నడ దర్శకుడితో  దేవగన్‌‌‌‌

బాలీవుడ్ స్టార్స్‌‌‌‌ ఇటీవల సౌత్ దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో అజయ్ దేవగన్‌‌‌‌ ఓ కన్నడ దర్శకుడితో సినిమా చేయబోతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కన్నడలో విడుదలై సూపర్ సక్సెస్‌‌‌‌ను అందుకున్న చిత్రం ‘సు ఫ్రమ్‌‌‌‌ సో’.  జేపీ తుమినాడు ఈ మూవీని డైరెక్ట్ చేయడంతో పాటు ఇందులో ఓ కీలకపాత్ర పోషించాడు. 

రూరల్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో వచ్చిన ఈ హారర్ కామెడీ మూవీ చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌ హిట్ కొట్టింది.  ఆ తర్వాత తెలుగు, మలయాళ భాషల్లోనూ ఆకట్టుకుంది.  దీంతో ఈ కన్నడ దర్శకుడితో సినిమా చేసేందుకు అజయ్ దేవగన్‌‌‌‌ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు జరిగినట్టు సమాచారం. జేపీ చెప్పిన స్టోరీలైన్‌‌‌‌కు ఇంప్రెస్‌‌‌‌ చేసిన ఈ బాలీవుడ్ స్టార్.. ఫుల్‌‌‌‌ స్క్రిప్ట్‌‌‌‌తో రమ్మని కోరాడట. నెల రోజుల్లో మరోసారి కలిసి ఈ ప్రాజెక్ట్‌‌‌‌ను ఫైనల్‌‌‌‌ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్‌‌‌‌ ప్రొడక్షన్స్‌‌‌‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ అక్షయ్ కుమార్‌‌‌‌‌‌‌‌,  సైఫ్‌‌‌‌ అలీఖాన్‌‌‌‌తో సినిమాలు చేస్తోంది.