
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో హోరా హోరీగా విమర్శల పర్వం నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నంపై చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. దీనిపై హుజూరాబాద్ కాంగ్రెస్ ఇంచార్జీ వొడితెల ప్రణవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నికలప్పుడు చనిపోతా అని బ్లాక్ మెయిల్ చేసి కౌశిక్ రెడ్డి గెలిచాడని విమర్శించారు.
పొన్నం పై ఆరోపణలు చేసే స్థాయి కాదని అన్నారు. మంత్రి పై చేసిన ఆరోపణలక ఋజువు చేయగలడా అని నిలదీశారు. తాము చేసే ఆరోపణలు రుజువు చేస్తామని చెప్పారు. ఆధారాలు లేని కౌశిక్ చివరికి దేవుడి పై ఒట్టేసి అబద్దాలు చెప్తున్నారని ఆరోపించారు. ప్రమాణాలు చేయడాన్ని కాంగ్రెస్ ప్రోత్సాహించదని చెప్పారు. ఆరోపణలు చేయడం ఆపకుంటే లీగల్ గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.