
రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్లు కాసుల పంట పండిస్తున్నాయి. సాధారణంగా ఒక సిరీస్ ముగియగానే ఇంకో సిరీస్ ప్రారంభమయ్యే సమయంలో ఆ సిరీస్ లోని ఫ్యాన్సీ నంబర్ల కోసం సెలబ్రిటీలు పోటీపడుతుంటారు. తమ వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ ఉంటే తమకు కలిసి వస్తుందని, దాన్ని తమకు లక్కీ నంబర్ గా భావిస్తారు. అందుకోసం ఎన్ని లక్షలు ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. ఒక్కో ఫ్యాన్సీ నంబర్ కు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చుచేసి వేలంలో దక్కించుకున్న సంఘటనలు అనేకం. ఇది రవాణా శాఖపై కాసుల వర్షం కురిపిస్తోంది. వాహనం ఖరీదు ధరతో పోలిస్తే అదనంగా కనీసం 15 నుంచి 20 శాతం వరకు ఫ్యాన్సీ నంబర్ మీదే ఖర్చుచేస్తున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లోని కొన్ని ఆర్టీఏ ఆఫీసుల్లో ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతోంది. అందులో ఖైరతాబాద్ ఆర్టీఏ జోన్ రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంది. దీని పరిధిలో అత్యంత సంపన్నులు, సెలబ్రిటీలు నివాసం ఉండే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలు ఉండడంతో రవాణా శాఖకు కాసుల పంట పండుతోంది. జూన్ 27న ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో స్పెషల్ నెంబర్ ఆక్షన్ ద్వారా ఏకంగా 42 లక్షల ఆదాయం రవాణా శాఖకు వచ్చింది.
వేలంలో ఏ నంబర్ ఎంతకు పలికిందంటే.?
ఆదాయం మొత్తం - రూ.42 లక్షల10 వేల 844
- TG09F9999 - రూ. 12లక్షలు
- యజమాని : కీస్టోన్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్
- TG09G0001 - రూ. 5 లక్షల 66 వేల 111
- యజమాని : NSPIRA మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
- TG09G0009 - రూ. 5లక్షల 25 వేలు
- యజమాని : శ్రీనివాస కన్ స్ట్రక్షన్
- TG09G0006 - రూ. 3లక్షల 92 వేలు
- యజమాని : సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్
- TG09G0005- రూ. 2 లక్షల1100
- యజమాని : నవాలికా చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్
- TG09G0019 - రూ. లక్షా 60 వేల 19
- యజమాని : సితార ఎంటర్టైన్మెంట్స్
- TG09G0007 - రూ. లక్షా16 వేలు
- యజమాని : గౌరీశంకర్ లచ్చిరెడ్డి