ప్రేమ లేదు..చిత్త శుద్ది లేదు.. ఆర్టీసీ భూముల కోసమే విలీనం బిల్లు

 ప్రేమ లేదు..చిత్త శుద్ది లేదు.. ఆర్టీసీ భూముల కోసమే విలీనం బిల్లు

ఆర్టీసీ భూములపై కేసీఆర్ కన్నేశారని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఏదో రకంగా ఆర్టీసీ భూములను అమ్ముకోవాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడేందుకు కేసీఆర్ కు ఆర్టీసీ కార్మికులపై  ప్రేమ పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు.  గతంలో ఆర్టీసీ కార్మికులను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంలోకి తీసుకోమని చెప్పిన కేసీఆర్..ఇప్పుడు ఎందుకు వాళ్లు గుర్తొచ్చారని నిలదీశారు. ఎన్నికల కోసమే కేసీఆర్ ఇదంతా చేస్తున్నారని..దీన్ని ఆర్టీసీ కార్మికులు గమనించాలని సూచించారు. 

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చే ప్రక్రియకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తోందని కిషన్ రెడ్డి అన్నారు.  కార్మికులకు మంచి జరిగేందుకు బీజేపీ ఎప్పుడూ వారి పక్షాన ఉంటుందన్నారు.  ఆర్టీసీ బిల్లుపై కేసీఆర్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్నారు. ఆర్టీసీ బిల్లుపై వివరణ కోరే అధికారం, సంప్రదాయం గవర్నర్ కు ఉంటుందన్నారు. కార్మికులకు మంచి  చేసేందుకే గవర్నర్ రిపోర్టు కోరారని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వానికి నిజంగా ప్రేమ ఉంటే..మరో రెండు రోజులు వర్షాకాల సమావేశాలు పొడిగించుకోవచ్చన్నారు.