ఓట్లు వేసేందుకు ప్రజలు భారీగా తరలిరండి

ఓట్లు వేసేందుకు ప్రజలు భారీగా తరలిరండి

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు హుజూరాబాద్‌లో 61.66 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నిక క్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. ఉప ఎన్నికలో ఓట్లు వేసేందుకు ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఉన్నతమైన పాలన కోసం సమర్థుడికి ఓటు వేయాలని సూచించారు.