కంబ్యాక్ వెనుక కఠిన నిర్ణయాలు.. నో ఫోన్.. నో సోషల్ మీడియా.. ఇది సంజూ ఫార్ములా !

కంబ్యాక్ వెనుక కఠిన నిర్ణయాలు.. నో ఫోన్.. నో సోషల్ మీడియా.. ఇది సంజూ ఫార్ములా !

(వెలుగు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)
కోల్‌‌కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియం. ఆదివారం రాత్రి వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టీమిండియా చావోరేవో తేల్చుకోవాల్సిన వరల్డ్ కప్ పోరు. భారీ టార్గెట్ ఛేజింగ్‌‌లో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి జట్టు ఇబ్బంది పడింది. కానీ, క్రీజులో ఉన్న సంజూ శాంసన్ ముఖంలో మాత్రం ఎక్కడా కంగారు లేదు. వికెట్లు పడుతున్నా తన ఏకాగ్రత చెదరడం లేదు. అతని బ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి అద్భుతమైన షాట్లతో బౌండరీల వర్షం ఆగడం లేదు.  మధ్య మధ్యలో పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సరిచేస్తూ  మునుపెన్నడూ లేనంత ఆత్మవిశ్వాసంతో కనిపించిన శాంసన్ తనలో గతంలో ఎప్పుడూ చూడని కోణాన్ని.. అసలైన  సంజూను చూపెట్టాడు. 

ఆఖరిదాకా క్రీజులో నిలిచి అజేయంగా 97 రన్స్ సాధించి జట్టును సెమీఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేర్చి అందరి మన్ననలు అందుకున్నాడు. 31 ఏండ్ల సంజూ గతంలో మూడు టీ20 సెంచరీలు కొట్టినా వాటన్నింటికంటే ఈ ఇన్నింగ్స్ వంద రెట్లు విలువైనది.  శాంసన్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పిన ఇన్నింగ్స్ ఇది. 2015 నుంచి జట్టులో ఉన్నా అప్పుడప్పుడు మెరుపులు మెరిపించడం తప్ప విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ మాదిరిగా కడదాకా ఉండి జట్టును గెలిపించిన సందర్భాలు సంజూ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేవనే చెప్పాలి. తానేంటో నిరూపించుకోవాలని  దశాబ్ద కాలంగా శాంసన్ కసిగా ఎదురుచూస్తున్న ఆ లోటును ఈడెన్ గార్డెన్స్ క్లాసిక్ ఇన్నింగ్స్ భర్తీ చేసింది. 

ఫోన్ స్విచ్ ఆఫ్.. సోషల్ మీడియాకు దూరం

వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటూ.. ఒక దశలో ‘నేను దేశం కోసం ఆడగలనా? గెలిపించగలనా?’ అనే సందేహాలు తనను వేధించినప్పుడు సంజూ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తన ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్విచ్ ఆఫ్ చేసి, సోషల్ మీడియాకు పూర్తిగా దూరమయ్యాడు. లోలోపల జరుగుతున్న అలజడిని ఆపి, మనసు చెప్పే మాట విన్నాడు. 10 రోజుల పాటు ఏ మ్యాచ్ ఆడకుండా కేవలం తన టెక్నిక్, బేసిక్స్ మీదే ఫోకస్ పెట్టి ఫలితం రాబట్టాడు. 

‘నేను ప్రధానంగా షాట్ సెలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టాను. గతంలో ఇదే టెక్నిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రాణించిన అనుభవం ఉండటంతో నా పద్ధతిని మార్చుకోవాలని అనుకోలేదు. నాపై నేను నమ్మకం ఉంచాను. ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్విచ్ ఆఫ్ చేశాను. సోషల్ మీడియాకు దూరంగా ఉండి నా అంతరాత్మ చెప్పే మాటలను మాత్రమే విన్నాను. నిజం చెప్పాలంటే ఈ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నా అనుభవం, జట్టులో నా పాత్ర కీలక పాత్ర పోషించాయి. మంచి ఆరంభం లభించినా వికెట్లు పడుతున్న సమయంలో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చివరివరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను. ప్రతీసారి ఇలా చేయాలని అనిపిస్తుంది కానీ అన్నిసార్లు సాధ్యపడదు. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అది వర్కౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అని సంజూ పేర్కొన్నాడు.

కాంబినేషన్ ఛేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. మాస్టర్ స్ట్రోక్

ఈ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా టాపార్డర్ ఒక విభిన్నమైన సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కొంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ వంటి యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్స్ ఒత్తిడిలో తడబడ్డారు. వీళ్లు లెఫ్టాండ్ బ్యాటర్లు కావడంతో ప్రత్యర్థి జట్లు ఆఫ్- స్పిన్ మంత్రాన్ని ప్రయోగించి కట్టడి చేశాయి. టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దెబ్బతిన్న తరుణంలో టాప్‌‌లో అనుభవం ఉన్న రైట్ హ్యాండర్ అవసరం ఏర్పడింది. రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థానంలో శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తుది జట్టులో చేర్చి ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దింపిన మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ నిర్ణయం మాస్టర్ స్ట్రోక్ అయింది. 11 ఏండ్ల అనుభవం ఉన్న శాంసన్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. టాపార్డర్‌‌‌‌లో యువ బలానికి సంజూ అనుభవం తోడవ్వడంతో నాకౌట్ ముగింట ఇండియా టాపార్డర్ బలోపేతం అవ్వడం జట్టుకు శుభసూచకం. 

ఇది ఆరంభం  మాత్రమే

సంజూ టాలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మాకు ఎప్పుడూ అనుమానం లేదు. న్యూజిలాండ్ సిరీస్ తర్వాత అతనిపై ఒత్తిడి తగ్గించేందుకే బ్రేక్ ఇచ్చాం. ఈ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అతను ఎక్కడా కండబలం వాడలేదు,  పక్కా క్రికెటింగ్ షాట్లతోనే ఆడాడు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. సంజూ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మరిన్ని వస్తాయి.  - గంభీర్

త్రివేండ్రంలో 4 రోజుల స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సంజూ కొట్టే ప్రతి షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈడెన్ గార్డెన్స్ దద్దరిల్లుతుంటే.. వేల మైళ్ల దూరంలో యూఏఈలో ఒక వ్యక్తి ఉద్వేగంతో టీవీకి అతుక్కుపోయాడు. మిడిల్ ఈస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశాల్లో ఉద్రిక్తతలు పెరిగి, ఆకాశంలో క్షిపణులను అడ్డుకుంటున్న భీకర శబ్దాల మధ్య కూడా అతని  దృష్టి సంజూ బ్యాటింగ్ మీదే ఉంది.  అతనే సంజూ గురువు జుబిన్ బరుచా.  న్యూజిలాండ్ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేవలం 46 రన్స్ చేసి విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో సంజూ బరుచాను త్రివేండ్రం ఆహ్వానించాడు. 

అతని గైడెన్స్‌‌లో కేరళ క్రికెట్ అసోసియేషన్ అకాడమీలో నాలుగు రోజుల పాటు పగలు, రాత్రి కఠోరంగా శ్రమించాడు. ఎర్ర మట్టి, నల్ల మట్టి, సిమెంట్ పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై పేసర్లు, స్పిన్నర్లు, సైడ్-ఆర్మ్ నిపుణులను ఎదుర్కొని తన బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరుచుకున్నాడు. అలాగే, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ గైడెన్స్‌‌లో సంజూ కీలకమైన టెక్నికల్ మార్పులు చేసుకున్నాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు బేస్ బలంగా ఉండేలా, బాల్‌‌‌‌ను హిట్ చేసే 'ట్రిగ్గర్ మూవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్' సమయం సరిగ్గా ఉండేలా జాగ్రత్తపడ్డాడు. ఆ శ్రమకు ఫలితమే వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆడిన ఈ ఇన్నింగ్స్. గతంలో తొందరపాటుగా కనిపించిన సంజూ, ఇప్పుడు బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడే వరకు ఓపిగ్గా ఉండి పర్ఫెక్ట్ టైమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝులిపించాడు.