బీజేపీలోకి సీతారాం నాయక్..?

బీజేపీలోకి సీతారాం నాయక్..?

వరంగల్: మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఇవాళ వరంగల్ వెళ్లిన ఆ పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఇవాళ ఆయన నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. మహబూబాబాద్ పార్లమెంటు స్థానం టికెట్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.   వరుసగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసల పరంపరా నడుస్తోనే ఉంది. తాజాగా బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ సీతారాం నాయక్ అసక్తకర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేశానని, పార్టీ అధినాయకత్వం తనను  గుర్తించడంలో వివక్ష చూపిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. 

సీతారాం నాయక్ మహబాూబాబాద్ ఎంపీ  టికెట్ కోసం బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు  కిషన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు చెప్పారు. పార్టీలోకి వస్తే తప్పకుండా తనని ఆహ్వానిస్తామని చెప్పారట. 

ALSO READ :- Gaami Review: గామి మూవీ రివ్యూ: విశ్వ‌క్‌సేన్ ప్ర‌యోగం ఎలా ఉందంటే?

త్వరలోనే ఏడు నియోజకవర్గాల కార్యకర్తలతో మాట్లాడి, భాజపాలో చేరికపై నిర్ణయం తీసుకుంటానని సీతారాం నాయక్ మీడియాతో అన్నారు. 
ఇదిలా ఉండగా ఇక్కడి నుంచి ఇదివరకే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన తేజావత్ రామచంద్రు నాయక్, గతంలో పోటీ  చేసి ఓడిపోయిన హుస్సేన్ నాయక్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈ సారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ సీతారాం నాయక్ ను బరిలోకి దింపడం ద్వారా విజయం ఖాయమని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే కిషన్ రెడ్డి సీతారాం నాయక్ తో భేటీ అయినట్టు  సమాచారం.