మంత్రివర్గంలో జనాభా దామాషా పాటించాలి : కోలా జనార్ధన్

మంత్రివర్గంలో జనాభా దామాషా పాటించాలి : కోలా జనార్ధన్

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జనాభా దామాషా పాటించాలని బీసీ డెమోక్రటిక్ జేఏసీ చైర్మన్ కోలా జనార్ధన్ డిమాండ్ చేశారు. మంగళవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సామాజిక ప్రజాస్వామ్య జేఏసీ రాష్ట్ర కమిటీ  సమావేశం చైర్మన్ చెన్న రాములు, గుజ్జ కృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు.

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్లను 33 నుంచి 50 శాతానికి పెంచాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి,  దేశవ్యాప్తంగా గుజరాత్, బిహార్ రాష్ట్రాల మాదిరిగా మద్యపాన నిషేధం అమలయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో బీసీ సంఘాల నాయకులు సత్యం గౌడ్, నందగోపాల్, స్వరూప, సూర్యనారాయణ, శకుంతల, వశపాక నరసింహ, పుష్పలత, కరుణశ్రీ, నిర్మల, స్వప్న, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.