తెలుగు భాష రక్షణకు కృషి చేద్దాం

V6 Velugu Posted on Jul 26, 2021

త్రిదండి చినజీయర్ స్వామి పిలుపు 

హైదరాబాద్, వెలుగు: తెలుగు భాష రక్షణకు  చిత్తశుద్ధితో కృషి చేద్దామని త్రిదండి చిన జీయర్ స్వామి పిలుపునిచ్చారు. శంషాబాద్ మండలం ముచ్చింతలలోని చినజీయర్ ఆశ్రమంలో తెలుగు భాషా చైతన్య సమితి, తెలుగు భాషా కూటమి, లక్ష సాధన ఫౌండేషన్, సత్యాన్వేషణ సంఘం ఆధ్వర్యంలో ‘పాలనలో  తెలుగు భాషా -బోధన– సమగ్ర భాషా వికాసం’ అంశంపై చర్చాగోష్టి జరిగింది. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడారు. తెలుగు భాషా పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బోధనలో తెలుగు భాషను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఈ మధ్యకాలంలో తెలుగు భాషలో జరుగుతున్న పరిణామాలు, డిక్షనరీల ప్రింట్, న్యూస్ పేపర్, రేడియో, టీవీల్లో తెలుగు అమలయ్యేలా చూడటం తదితర అంశాలపై చర్చించారు. తెలుగు భాషా ఐక్యవేదికలను ఏకం చేయడం, తెలుగు అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, తెలుగు ప్రాధాన్యత, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు.

Tagged language, chinna jeeyar Swamy, Telugu,

Latest Videos

Subscribe Now

More News